• search
  • Live TV
విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కొత్త జిల్లాల ఏర్పాటులో కీలక నిర్ణయం - నోటిఫికేషన్ పైనా : ప్రభుత్వ వ్యూహం ఇదే..!!

By Chaitanya
|
Google Oneindia TeluguNews

ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ పైన ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఏపీ ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు స్వీకరించి మూడేళ్లు పూర్తి కానుంది. దీంతో...ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు కొత్త జిల్లాలు ఏర్పాటు పూర్తి చేయాలని నిర్ణయించింది. ఉగాది నుంచి కొత్త జిల్లాల్లో పాలన ప్రారంభించాలని డిసైడ్ అయింది. ఇప్పటికే దీనికి సంబంధించి ముఖ్యమంత్రి జగన్ అధికారులు స్పష్టమైన కార్యాచరణ నిర్దేశించారు. రాజకీయంగా ఆరోపణలు వస్తున్నా.. ప్రజాభిప్రాయ సేకరణ పూర్తి చేసి..అవసరమైన మార్పులు - చేర్పులతో కొత్త జిల్లాల్లో పాలన ప్రారంభించాలని నిర్ణయించారు.

కసరత్తు వేగవంతం

కసరత్తు వేగవంతం

అదే సమయంలో మౌళిక వసతులతో పాటుగా అధికారులు - ఉద్యోగుల కేటాయింపు పైనా కసరత్తు ప్రారంభమైంది. ఇక, తాజాగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉగాదికి పది పదహేను రోజుల ముందే ఈ దిశలో అవసరమైన పాలనాపరమైన చర్యలన్నింటిని పూర్తి చేయాలని భావిస్తోంది. దీనిలో భాగంగా కొత్త జిల్లాల ఏర్పాటు ప్రకియకు సంబంధించి మార్చి 15ను డెడ్‌లైన్‌గా నిర్ణయించింది.

ఆ లోగానే తుది నోటిఫికేషన్లు జారీ చేయాలని జిల్లాల కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. ఈ నెలాఖరుకు ఈ ప్రక్రియను పూర్తిచేసి నోటిఫికేషన్ల రూపకల్పనపై దృష్టి సారించాలని అధికారయంత్రాంగం భావిస్తోంది. ఈ మేరకు అవసరమైన చర్యలను వేగంగా తీసుకునేందుకు నాలుగు సబ్‌కమిటీలను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

జిల్లా అధికారులకు మార్గదర్శకాలు

జిల్లా అధికారులకు మార్గదర్శకాలు

సరిహద్దుల నిర్ధారణ, మ్యాప్‌లు, భవనాల నిర్మాణం, ఆస్తులు, ఉద్యోగులు, ఐటి సేవల వంటి అంశాలను ఈ కమిటీల పరిధిలోకి చేర్చారు. క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనులను సిఎస్‌, సిఎంలే నేరుగా పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం. మొత్తం 26 జిల్లాలకు సంబంధించిన సరిహద్దులను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలను అదేశాలు ఇప్పటికే జారీ అయ్యాయి.

ఆ జిల్లాలోకి వచ్చే మండలాలు, శాసనసభ నియోజకవర్గాల హద్దులను కూడా సిద్ధం చేయాలని సూచించారు. కొత్త జిల్లాల్లో ప్రస్తుతం ఉన్న ఉద్యోగులతో సర్దుబాటు చేసుకొనే విధంగా నిర్ణయం తీసుకున్నారు. తాజాగా ఇచ్చిన మార్గదర్శకాల్లో అన్ని జిల్లాల్లో అన్ని ప్రభుత్వ శాఖలను ఏర్పాటు చేయాలని స్పష్టం చేసారు.

న్యాయ వివాదాలకు తావు లేకుండా

న్యాయ వివాదాలకు తావు లేకుండా

కొత్త జిల్లాల పరిధిలోకి వచ్చే స్థిర, చరాస్తుల వివరాలు కూడా సిద్ధం చేయాలని, ప్రభుత్వ, ప్రభుత్వ రరగ సంస్థలకు చెరదిన భవనాల వివరాలు కూడా వాటిల్లో ఉరడాలని స్పష్టం చేసారు. ఇప్పటికే ఉను ప్రభుత్వ భవనాల వివరాలు కూడా సమర్పిరచాలనిఆదేశాలు వెళ్లాయి. అలాగే వాహనాలు, ఫరిుచర్‌ వరటి చరాస్తుల వివరాలు కూడా ప్రభుత్వానికి పంపాలని కలెక్టర్లకు సూచించారు.

కొత్త జిల్లాల్లో పరిపాలనా కార్యాలయాల ఏర్పాటు సమయంలోనే ఐటీ అవసరాలను ముందుగానే గుర్తించడంతో పాటుగా.. వీడియో కాన్ఫెరెన్స్.. ఐటి సర్వర్లను ఏర్పాటు చేయడంపైనా దృష్టి సారించాలని ఆ శాఖల అధికారులకు సూచనలు చేసారు. ఇక, కీలకమైన పరిపాలనా భవనాల ఏర్పాటు కోసం స్పష్టమైన మార్గదర్శకాలను ప్రభుత్వం జారీ చేసింది. జిల్లాల్లో ప్రభుత్వ భవనాల ఏర్పాటు కోసం కనీసం 30వేల చదరపు అడుగుల భూమిని సిద్ధం చేయాలని, మరో 20 వేల చదరపు అడుగుల ఖాళీ ప్రభుత్వ భూమిని కూడా గుర్తించాలని నిర్దేశించారు.

కొత్తగా కమిటీ ఏర్పాటు

కొత్తగా కమిటీ ఏర్పాటు

జిల్లాల ఏర్పాటు సమయంలో స్థానికంగా ఏర్పడే న్యాయపరమైన చిక్కులపైనా అధ్యయనం చేయాలని సూచించింది. కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా జిల్లా కలెక్టర్ల నుంచి వచ్చే సమస్యలు..అభ్యంతరాలాను పరిశీలించి వాటికి పరిష్కారంతో పాటుగా మార్గనిర్దేశం చేయటానికి వీలుగా ముగ్గురు అధికారులతో ఒక కమిటీని ఏర్పాటు చేసారు.

ప్రణాళిక శాఖ కార్యదర్శి అధ్యక్షతన పనిచేసే ఈ కమిటీ జిల్లా కలెక్టర్లతో పాటు ఈ ప్రక్రియలో భాగస్వాములైన ఇతర అధికారులకు అవసరమైన సూచనలు చేస్తుంది. న్యాయ పరంగా ఎటువంటి అవాంతరాలకు అవకాశం లేకుండా.. అంతా పక్కగా వ్యవహించి..ఉగాది నాడు ఒకే సమయంలో 13 కొత్త జిల్లాల్లో పాలన ప్రారంభించాలని సీఎం జగన్ నిర్ణయించారు.

దీనికి అనుగుణంగా కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ పైన నిరంతరం ఆయన సమాచారం సేకరిస్తూ..అవసరమైన సూచనలు వస్తుండంతో ..అధికారులు ప్రత్యేకంగా దీని పైన ఫోకస్ పెట్టారు.

English summary
AP Government moving strategically on forming new districts in the state by Ugadi, concentrated on bifurcation of districts and employees allotment.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X