Anna Canteens: అన్న క్యాంటీన్లకు భారీ స్పందన-విరాళాలకు సర్కార్ బ్యాంక్ ఖాతా..!
ఏపీలో ఐదేళ్ల విరామం తర్వాత అన్న క్యాంటీన్లు ఇవాళ పునరుద్ధరించారు. రాష్ట్రవ్యాప్తంగా 100 అన్న క్యాంటీన్లను ఇవాళ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం తిరిగి ప్రారంభించింది. సీఎం చంద్రబాబు తన సతీమణి భువనేశ్వరితో కలిసి గుడివాడలో అన్న క్యాంటీన్ ను పునరుద్ధరించడంతో పాటు అక్కడే కుటుంబంతో సహా భోజనం కూడా చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా పునఃప్రారంభమైన అన్న క్యాంటీన్లకు తొలిరోజే మంచి స్పందన లభించింది.
రాష్ట్రంలో మొత్తం 203 అన్న క్యాంటీన్లను అందుబాటులోకి తేవాలని భావిస్తున్న ప్రభుత్వం ఇవాళ 100 క్యాంటీన్లు పునరుద్ధరించింది. త్వరలో మిగతా క్యాంటీన్లు కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ నేపథ్యంలో అన్న క్యాంటీన్ల నిర్వహణకు విరాళాలు ఇచ్చేందుకు చాలా మంది ముందుకు వస్తున్నారు. వీరి నుంచి విడివిడిగా విరాళాలు సేకరించే కంటే రాష్ట్రవ్యాప్తంగా ఒకే ఖాతా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఇందులో భాగంగా ఇవాళ అన్న క్యాంటీన్లకు విరాళాలు ఇచ్చే వారి కోసం స్టేట్ బ్యాంక్ ఖాతాను ప్రభుత్వం ప్రారంభించింది. సాధారణ ప్రజలు, పారిశ్రామిక వేత్తలు, వృద్ధులు అన్న క్యాంటీన్ లకు విరాళాలు ఇస్తున్నారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. బుధవారం ఒక్కరోజే రూ.2 కోట్లకు పైగా విరాళం ప్రభుత్వానికి అందింది. వివిధ వర్గాల ప్రజలు, సంస్థలు విరాళాలు ఇచ్చేందుకు ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో.. అన్న క్యాంటీన్ ల నిర్వహణ చూస్తన్న మునిసిపల్ శాఖ విరాళాలు తీసుకునేందుకు ఏర్పాటు చేసిన బ్యాంక్ ఖాతా వివరాలు ప్రకటించింది.
విరాళాలు పంపించాలనుకునేవారు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఖాతాకు నేరుగా ఆన్లైన్ విధానంలో లేదా చెక్ రాసి పంపవచ్చు.
Name:- ANNA CANTEENS
A/C.no.37818165097
Branch:- SBI,CHANDRMOULI NAGAR, GUNTUR
IFSC : SBIN0020541












Click it and Unblock the Notifications