ఏపీలో ఆ ఉద్యోగులకు 23 శాతం జీతాల పెంపు - ఉత్తర్వులు జారీ..!

రాష్ట్రంలో ఎన్నికల వేళ వైసీపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో వైఎస్ జగన్ పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు ఓ కీలక విభాగంలో ఉన్న ఉద్యోగులకు జీతాలు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే ఉద్యోగుల్లో ఉన్న అసంతృప్తి తొలగించేందుకు ప్రయత్నిస్తున్న ప్రభుత్వం.. వరుసగా పలు శాఖల్లో జీతాలు, గౌరవ వేతనాలు పెంచుతోంది. ఇదే క్రమంలో విద్యాశాఖలోని ఓ కీలక విభాగంలో ఉద్యోగులకు గతంలో ఇచ్చిన హామీ మేరకు గౌరవ వేతనం భారీగా పెంచింది.

రాష్ట్రంలోని విద్యాశాఖలో ఉన్న సమగ్ర శిక్షలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఇస్తున్న గౌరవ వేతనాల్ని తాము అధికారంలోకి రాగానే పెంచుతామని వైఎస్ జగన్ గతంలో హామీ ఇచ్చారు. అయితే నాలుగేళ్లుగా ఇది అమలు కాలేదు. దీంతో సమగ్ర శిక్ష ఉద్యోగులు తమ గౌరవ వేతనాల్ని పెంచాలని ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. దీంతో ప్రభుత్వం తాజాగా సమగ్ర శిక్షలో పనిచేస్తూ 2019లో జీతాల పెంపు పొందని ఉద్యోగులందరికీ గౌరవ వేతనాలు పెంచింది.

ap government orders to hike honorarium to these employees by 23 percent

రాష్ట్రంలో సమగ్ర శిక్షలో పనిచేస్తూ 2019లో గౌరవ వేతనాలు పెరగని వాళ్లందరికీ జనవరి 1, 2024 నుంచి ఏకంగా 23 శాతం వేతనాలు పెంచుతూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆ మేరకు వారికి వేతనాలు పెరిగాయి. సమగ్ర శిక్ష ప్రాజెక్ట్ డైరెక్టర్ నుంచి తాజా పరిస్ధితులపై అందిన సమాచారం మేరకు ఈ వేతనాలు పెంచుతున్నట్లు విద్యాశాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది.తాజా ఉత్తర్వుల ప్రకారం ప్రాజెక్ట్ డైరెక్టర్ తదుపరి చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ ఆదేశించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+