ఆ ఉద్యోగులపై ఏపీ సర్కార్ రివర్స్ అస్త్రం: జీతాలు తిరిగి ఇవ్వాలంటూ
ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి సీఎం జగన్ ఉద్యోగుల సంక్షేమానికి కూడా పెద్ద పీట వేశారు . ఆంధ్రప్రదేశ్ లో అన్ని ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగులకు జీతాలు పెంచి వారి అభివృద్ధికి ప్రభుత్వం దోహద పడుతున్న సంకేతాలు ఇచ్చారు. అయితే, ఇప్పుడు ప్రభుత్వం ఊహించని విధంగా మరో కొత్త నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. నిన్నా మొన్నటి దాకా వివిధ ప్రాజెక్ట్ లు, అభివృద్ధి పనుల విషయంలోనే రివర్స్ అస్త్రం ప్రయోగించిన సర్కార్ ఇప్పుడు ఉద్యోగుల విషయంలో కూడా ప్రయోగిస్తుంది.

గత ప్రభుత్వం హయాంలో
ఆంధ్రప్రదేశ్ మహిళ, శిశుసంక్షేమశాఖలో కాంట్రాక్ట్ పద్దతిలో పనిచేసే ఉద్యోగుల విషయంలో ప్రభుత్వం రివర్స్ అస్త్రం ప్రయోగించినట్టు సమాచారం. గత ప్రభుత్వం హయాంలో ఈ శాఖలో పనిచేసే కాంట్రాక్ట్ ఉద్యోగుల జీతాలను రూ. 3వేల నుంచి రూ 7వేల రూపాయలకు పెంచారు. దీంతో కాంట్రాక్ట్ ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేశారు. అయితే, ఇప్పుడు ప్రభుత్వం వీరిపై రివర్స్ అస్త్రం ప్రయోగించింది.

కాంట్రాక్ట్ ఉద్యోగులు ఆందోళన
పెంచిన జీతాలను ఉద్యోగులను వెనక్కి ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించినట్టు సమాచారం. దీంతో స్త్రీశిశు సంక్షేమ శాఖలో పని చేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వమే ఇచ్చి ఇప్పుడు తిరిగి ఇచ్చెయ్యమంటేఎలా అని వారు వాపోతున్నారు. ఇప్పటి వరకు అందుకున్న పెరిగిన జీతం మొత్తం తిరిగి చెల్లించాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి.

అసలు కారణం ఏంటి అనేది
అంతపెద్ద మొత్తంలో డబ్బును ఇప్పుడు ఎక్కడినుంచి తెచ్చి ఇవ్వాలని ఆందోళన చెందుతున్నారు. అసలు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వెనుక అసలు కారణం ఏంటి అనేది కాంట్రాక్ట్ ఉద్యోగులకు తెలీటం లేదు . ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో కాంట్రాక్ట్ ఉద్యోగులు గందరగోళంలో ఉన్నారు.
-
దేశవ్యాప్తంగా 'ఎనర్జీ లాక్ డౌన్'.. ప్రతి బుధవారం సెలవు.. కఠినమైన రూల్స్ అమల్లోకి..! -
వాస్తు ప్రకారం ఐశ్వర్యాన్ని తెచ్చేది మనీప్లాంట్ కాదు.. 'క్రాసులా' మొక్కను పెంచాలి -
కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు. -
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
విద్యార్థులకు గుడ్ న్యూస్.. మరో 4 రోజులు స్కూళ్లకు సెలవులు..! -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
రైతు భరోసా రెండు, మూడో విడత నిధుల జమ షెడ్యూల్ ఫిక్స్- ఎవరికి ఎప్పుడు..!! -
రామ్ చరణ్ "పెద్ది" కోసం ప్రభాస్ ఫేవరెట్ బ్యూటీ.. -
పదో తరగతి ఫలితాల విడుదల పై తాజా నిర్ణయం..!! -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్!












Click it and Unblock the Notifications