OG Benefit Show: పవన్ ఓజీ బెనిఫిట్ షో సమయం మార్పు-ఉత్తర్వులు జారీ..!

టాలీవుడ్ పవర్ స్టార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ చిత్రం విడుదలకు సిద్దమవుతోంది. ఈ నెల 25న ఈ చిత్రం విడుదలకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ఇప్పటికే ఈ చిత్రం బెనిఫిట్ షోలకు కూడా అనుమతి ఇచ్చింది. దీనిపై అభ్యంతరాలు రావడంతో ఇవాళ దాన్ని మారుస్తూ మరో జీవో విడుదల చేసింది. ఈ మేరకు పవన్ అభిమానులకు ఊరట దక్కనుంది.

పవన్ కళ్యాణ్ ఓజీ చిత్రం ఈ నెల 25న విడుదల రానున్న నేపథ్యంలో అదే రోజు తెల్లవారుజామున ఒంటి గంటకు ఈ చిత్రం బెనిఫిట్ షోలు ప్రదర్శించుకునేందుకు ఏపీ ప్రభుత్వం ఇప్పటికే అనుమతి ఇచ్చింది. అలాగే వాటికి వెయ్యి రూపాయల టికెట్ వసూలు చేసుకునేందుకు కూడా అనుమతి ఇచ్చింది. ఈ మేరకు జీవో కూడా జారీ చేసింది. అయితే అర్ధరాత్రి బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వడంపై అభ్యంతరాలు రావడంతో దీనిపై వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది.

ap government revises timing of pawan kalyan s OG movie- here is details

ఈ నేపథ్యంలో గతంలో ఇచ్చిన జీవోలో సవరణలు చేసి ఇవాళ మరో కొత్త జీవోను ప్రభుత్వం విడుదల చేసింది. దీని ప్రకారం ఓజీ సినిమా బెనిఫిట్ షోను 25వ తేదీ తెల్లవారు జామున ఒంటి గంటకు బదులుగా అంతకు ముందు రోజు అంటే 24వ తేదీ రాత్రి 10 గంటలకే ప్రదర్శించుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీంతో ఓజీ చిత్రం బెనిఫిట్ షోను అభిమానులు ముందుగానే చూసేందుకు అవకాశం లభిస్తోంది. లేకపోతే తెల్లవారు జామువరకూ థియేటర్ల వద్ద ఎదురుచూపుల బాధ తప్పినట్లయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+