Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఏపీలో మరో రివర్స్‌ టెండరింగ్‌ సక్సెస్‌- ఈసారి రూ.63 కోట్లు ఆదా..

ప్రజాధనాన్ని ఆదా చేసేందుకు ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న రివర్స్‌ టెండరింగ్ వల్ల సివిల్ సప్లయిస్ డోర్ డెలివరీ వాహనాల కొనుగోళ్ళలో సుమారు 63 కోట్లు ఆదా అయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా నిత్యావసర సరుకులను ప్రజల ఇళ్ల వద్దకే అందించాలనే ప్రభుత్వ నిర్ణయం అమలు చేసేందుకు నిర్వహించిన ఈ రివర్స్ టెండరింగ్ లో ప్రభుత్వం ప్రజల సొమ్మును ఆదా చేసినట్లు సివిల్ సప్లయిస్ కమిషనర్‌ అండ్ ఎక్స్‌అఫీషియో సెక్రటరీ కోన శశిధర్ తెలిపారు.

ఏపీ ప్రభుత్వం గతేడాది అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రివర్స్ టెండరింగ్ విధానాన్ని విజయవంగా అమలు చేస్తూ ప్రజల సొమ్ము వృధా కాకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇదే కోవలో పౌరసరఫరాల శాఖ 9,260 డోర్ డెలివరీ వాహనాలను కొనుగోలుకు టెండర్లను ఆహ్వానించింది. టెండర్లలో సుజుకీ, టాటామోటార్స్‌ సంస్థలు బిడ్లు దాఖలు చేశాయి. వీటిపై రెండు వారాల కిందటే జ్యుడీషియల్ ప్రివ్యూ కూడా పూర్తయ్యింది. అయితే రివర్స్ టెండరింగ్ ద్వారా తక్కువ కోట్ చేసే సంస్థకు టెండర్ ఇవ్వడం ద్వారా ప్రజాధనాన్ని ఆదా చేయాలన్న ముఖ్యమంత్రి జగన్‌ ఆదేశాల మేరకు సివిల్ సప్లయిస్ కమిషన్ అండ్ ఎక్స్‌అఫీషియో సెక్రటరీ కోన శశిధర్ ఆధ్వర్యంలో రివర్స్ టెండరింగ్ నిర్వహించారు.

ap government saves rs.63 cr in purchase of civil supplies vehicles with reverse tendering

పారదర్శకంగా టెండర్ల ప్రక్రియ కొనసాగించాలన్న సీఎం ఆదేశాలతో కేంద్రప్రభుత్వ పరిధిలోని గవర్నమెంట్ ఈ-మార్కెట్ ప్లేస్ పోర్టల్‌లో నిర్వహించిన రివర్స్‌ టెండరింగ్‌ లో టాటామోటార్స్ సంస్థ... సుజుకీ సంస్థ కన్నా తక్కువ రేట్‌ కోట్ చేసి బిడ్‌ను దక్కించుకుంది. మొదట్లో ఒక్కో వాహనానికి 6.60 లక్షలు కోట్ చేసిన టాటా మోటార్స్... రివర్స్‌ బిడ్డింగ్ లో 5,72,539 లక్షలకు తగ్గించింది. దీంతో ఒక్కో వాహనంపై సుమారు 67,460 రూపాయలు ఆదా అయ్యాయి. పోటీ సంస్థ కన్నా తక్కువకు వాహనాలు ఇచ్చేందుకు ముందుకు రావడంతో టాటామోటార్స్‌ బిడ్‌కు అధికారులు ఆమోదం తెలిపారు.

Recommended Video

    Hyderabad Floods Remembering 1908 Musi Floods That Changed Face of Hyderabad || Oneindai Telugu

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+