AP Pensions: ఏపీలో కొత్త పెన్షన్లకు ముహుర్తం ఖరారు-ముందుగా వీరికే..!

ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గతంలో ఉన్న పెన్షన్లను (pensions) కొనసాగించడం లేక అనర్హుల ఏరివేత ప్రక్రియ మాత్రమే కొనసాగుతోంది. కొత్త పెన్షన్లు మాత్రం ఇవ్వడం లేదు. దీనిపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో కొత్త పెన్షన్ల జారీకి ప్రభుత్వం సిద్ధమైంది. జూన్ నుంచి అర్హులకు కొత్త పెన్షన్లను ఇవ్వాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో ముందుగా వితంతువులకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఇప్పటికే కొత్త పెన్షన్లపై అధికారులు వేసిన అంచనా ప్రకారం ఒక్క వింతుతు పెన్షన్ అర్హులే 1.53 లక్షల మంది ఉన్నారు. వీరందరికీ నాలుగు వేల చొప్పున పెన్షన్ ఇస్తే నెలకు ప్రభుత్వంపై 60 కోట్ల భారం పడుతుందని అంచనా. దీంతో ముందుగా వితంతువులకు ఈ పెన్షన్లు ఇచ్చి, ఆ తర్వాత దశల వారీగా మిగిలిన కేటగిరీల అర్హులకు జారీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు అధికారులకు త్వరలో ఆదేశాలు జారీ చేయనున్నారు.

AP Government Sets June Deadline for New Pensions Distribution Widows to Benefit First

వితంతువుల తర్వాత దివ్యాంగులకు పెన్షన్లు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు దరఖాస్తులు ఆహ్వానించగా లక్ష మంది దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆరున్నర లక్షల మంది దివ్యాంగులకు ప్రభుత్వం పెన్షన్ ఇస్తోంది. వీరిలో లక్ష మంది వరకూ అనర్హులు ఉన్నారని వైద్యాధికారులు తేల్చారు. వీరిని తొలగించి కొత్తగా అర్హులకు ఇచ్చే విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. అలాగే మిగిలిన కేటగిరీల వారికి కూడా పెన్షన్ల మంజూరుకు అధికారులు లెక్కలు సిద్దం చేస్తున్నారు. కొత్త పెన్షన్ల జారీ ప్రారంభిస్తే 10 లక్షల మంది వరకూ దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని, వీరికి నెలకు 400 కోట్ల చొప్పన ఏడాదికి 4800 కోట్ల భారం భరించేందుకు ప్రభుత్వం సిద్ధం కావాల్సి ఉంటుందని అధికారులు చెప్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+