AP Pensions: ఏపీలో ఏప్రిల్ నెల పెన్షన్లు ఆలస్యం- కారణమిదే..!
ఏపీలో ప్రతీ నెలా ఒకటో తేదీన వైసీపీ ప్రభుత్వం ఠంచనుగా పంపిణీ చేస్తున్న సామాజిక పెన్షన్లు ఈసారి మాత్రం ఆలస్యం కాబోతున్నాయి. ఈసారి పెన్షన్లు ఆలస్యం అవుతున్నట్లు ప్రభుత్వం ఇవాళ ఓ ప్రకటన చేసింది. సమాచార మంత్రి వేణుగోపాలకృష్ణ ఈ మేరకు పెన్షన్ల ఆలస్యంతో పాటు దానికి గల కారణాన్ని కూడా వెల్లడించారు. దీంతో ఈసారి పెన్షన్ల కోసం రెండు రోజులు వేచి చూడాల్సిన పరిస్దితి.

ఏపీలో ఏప్రిల్ నెల ఒకటో తేదీన ఇవ్వాల్సిన వైఎస్సార్ ఆసరా పెన్షన్లు ఆలస్యం కాబోతున్నట్లు మంత్రి చెల్లుబోయిన వేణు ఇవాళ ప్రకటించారు. అయితే ఇందుకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఇబ్బందీ లేకపోయినా రిజర్వు బ్యాంకు ఏప్రిల్ 1న సెలవు ప్రకటించడం, ఏప్రిల్ 2వ తేదీ ఆదివారం రావడమే కారణంగా ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 3న మాత్రం యథావిధిగా పింఛన్లు పంపిణీ చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు.
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉద్యోగులు, పెన్షనర్ల పెన్షన్లు ఆలస్యమవుతున్నా సామాజిక పెన్షన్లు మాత్రం ఠంచనుగా ప్రతీ నెలా ఒకటో తేదీనే వారికి ఇంటి వద్దే అందుతున్నాయి. కానీ ఈసారి మాత్రం బ్యాంకు కారణాలతో పెన్షన్ల ఆలస్యం జరుగుతోంది. దీంతో పెన్షనర్లు ఈ విషయాన్ని అర్దం చేసుకోవాలని ప్రభుత్వం కోరుతోంది. ఏప్రిల్ నెలకు మాత్రమే ఇలా ఆలస్యం అవుతుందని, మే నుంచి తిరిగి ఎప్పటిలాగే ఒకటో తేదీకే పెన్షన్ అందిస్తామని చెబుతోంది.












Click it and Unblock the Notifications