వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేంద్రం ముందు కీలక ప్రతిపాదన ఉంచిన జగన్ ప్రభుత్వం: దిశ మారడం ఖాయం..!!

|
Google Oneindia TeluguNews

అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కేంద్రానికి కీలక ప్రతిపాదనలను పంపించింది. రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన తొమ్మిది ప్రపోజల్స్ అవి. పారిశ్రామికాభివృద్ధిని పరుగులు పెట్టించే దిశగా జగన్ సర్కార్.. వాటిని రూపొందించింది. వాటిని అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం- ఆర్థిక సహాయాన్ని అందజేయాల్సి ఉంటుంది. ఈ ప్రతిపాదనలు యధాతథంగా ఆమోదం పొందితే.. రాష్ట్రం దశ-దిశ మారడం ఖాయం.

ప్రధానమంత్రి గతిశక్తిలో భాగంగా రాష్ట్రంలో పలు ప్రాజెక్టులను మంజూరు చేయాలని జగన్ సర్కార్- కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. దీనికి అవసరమైన తొమ్మిది ప్రతిపాదనలను అందజేసింది. శాఖలవారీగా వాటికి సంబంధించిన డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టులను సమర్పించింది. కర్నూలు జిల్లాలోని ఓర్వకల్‌లో 288 కోట్ల రూపాయలు, కడప జిల్లాలోని కొప్పర్తిలో 171 కోట్ల రూపాయలతో మెగా ఇండస్ట్రియల్ హబ్‌లకు నీటి వసతిని కల్పించడం, రోడ్ కనెక్టివిటీని పెంచడం వంటివి ఇందులో ఉన్నాయి.

మల్టీ-మోడల్ కనెక్టివిటీ కోసం కేంద్ర ప్రభుత్వం పీఎం గతి శక్తి జాతీయ మాస్టర్ ప్లాన్‌ను అమలు చేస్తోన్న విషయం తెలిసిందే. దీనికింద ఆర్థిక సహాయాన్ని అందజేయాలంటూ జగన్ ప్రభుత్వం తొమ్మిది ప్రతిపాదనలను కేంద్రానికి అందజేసింది. ఈ తొమ్మిది ప్రాజెక్టుల అంచనా వ్యయం సుమారు 782 కోట్ల రూపాయలు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం పీఎం గతి శక్తి కింద 5,000 కోట్ల రూపాయలను దశలవారీగా మంజూరు చేయాల్సి ఉంది.

AP government submitted 9 projects to the Centre for financial assistance to the tune of Rs 782 Crore

రాష్ట్ర ప్రభుత్వం అందజేసిన ఈ తొమ్మిది ప్రతిపాదనలు కూడా వేర్వేరు శాఖల వద్ద పరిశీలనలో ఉన్నాయి. ఓర్వకల్‌లో రోజుకు 74, కొప్పర్తిలో 46 మిలియన్ లీటర్లను సరఫరా చేయడానికి అవసరమైన నీటి వసతిని కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. తిరుపతి జిల్లా నాయుడుపేట, చిత్తూరు జిల్లా రౌతు సురమల పారిశ్రామిక క్లస్టర్‌లకు కనెక్టివిటీ కోసం భూమిని సేకరించడం, జాతీయ రహదారి-16 విస్తరణ పనుల వంటి ప్రతిపాదనలు కేంద్రం వద్ద ఉన్నాయి.

అచ్యుతాపురం-అనకాపల్లి రహదారిని నాలుగు వరుసలు లేన్లుగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని జగన్ ప్రభుత్వం పేర్కొంది. దీనికి సంబంధించిన డీపీఆర్‌ను కేంద్రానికి పంపించింది. అనంతపురం జిల్లాలో కియా మోటార్స్ ప్లాంట్‌కు కనెక్టివిటీ, భోగాపురం గ్రీన్ ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అభివృద్ధి, కొప్పర్తి వద్ద రైల్వే సైడింగ్ ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన రోడ్-ఓవర్-బ్రిడ్జి నిర్మాణం వంటివి ఈ తొమ్మిది ప్రతిపాదనల్లో ఉన్నాయి.

English summary
The AP government, led by CM YS Jagan Mohan Reddy, has submitted nine projects to the centre for financial assistance to the tune of Rs 782 crore under the PM Gati Shakti national master plan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X