ఏపీలో రైతుల కోసం మరో కొత్త పథకం..! 24 నుంచే అమల్లోకి..!
ఏపీలో గతేడాది అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్ రైతులకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీ అన్నదాత సుఖీభవ ఇప్పటికే అమలువుతోంది. తాజాగా రెండో విడత నిధుల్ని కూడా రైతుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసింది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు రైతులు పాత విధానాలను వీడి కొత్త సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన పెంచుకుని, అమల్లో పెట్టాలని పిలుపునిచ్చారు. దీనికి కొనసాగింపుగా చంద్రబాబు ప్రభుత్వం మరో కొత్త పథకంతో రైతుల ముందుకు వస్తోంది.
వ్యవసాయ రంగంలో పెనుమార్పులు తీసుకురావడం ద్వారా రైతుల సాగును లాభసాటి చేసేందుకు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల్లో భాగంగా పంచ సూత్రాలపై ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో ఈ నెల 24 నుంచి "రైతన్నా మీకోసం" పేరుతో పలు కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. 24వ తేదీ నుంచి 29వరకూ ప్రతీ రైతు ఇంటికి ప్రజాప్రతినిధులు, అధికారులు వెళ్లనున్నారు. డిసెంబర్ 3వ తేదీన రైతు సేవా కేంద్రాల పరిధిలో వర్క్ షాపులు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అనుంబంధ రంగాలు, మార్కెటింగ్ శాఖ అధికారులు పాల్గొంటారు.

ఈ మేరకు "రైతన్నా మీకోసం" కార్యక్రమంపై వ్యవసాయ, అనుబంధ రంగాల అధికారుల, రైతు సేవా కేంద్రాల సిబ్బంది సహా 10 వేలమందితో సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. అన్నదాతల సంక్షేమం కోసం, సాగు విధానంలో తీసుకురావాల్సిన మార్పులకు ఉద్దేశించిన పంచ సూత్రాలపై రైతులకు అవగాహన కల్పించే అంశంపై టెలీకాన్ఫరెన్స్‌లో ఆయా శాఖలకు దిశానిర్ధేశం చేశారు. ఈ మేరకు రాష్ట్రంలో క్షేత్ర స్థాయిలో నిర్వహించాల్సిన కార్యక్రమాలకు సంబంధించిన షెడ్యూల్ ప్రకటించారు. రైతు సేవా కేంద్రాల్లో పనిచేసే సిబ్బంది ఈ కార్యక్రమంలో కీలక భూమిక పోషించనున్నారు.
రాష్ట్రంలో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు, అన్నదాతలకు మరింత మేలు చేకూర్చేలా పంచ సూత్రాలను ప్రకటించామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఇందులో నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటలు, అగ్రిటెక్, ఫుడ్ ప్రాసెసింగ్, ప్రభుత్వాల మద్ధతు అనే అంశాలతో పంచ సూత్రాల విధానాన్ని చేపట్టామన్నారు. ఈ పంచసూత్రాలను ప్రతి రైతుకే కాకుండా రైతు కుటుంబ సభ్యులకు కూడా అవగాహన కల్పించాలన్నారు. రైతులతో పాటు పాడి రైతులు, పౌల్ట్రీ, గొర్రెల పెంపకం దారులు, ఆక్వా, ఉద్యాన, సెరీ కల్చర్ రైతలకూ అవగాహన కల్పించాలన్నారు.

రైతులకు వ్యవసాయం గిట్టుబాటు అయ్యేలా ఆధునిక పద్ధతుల ద్వారా పంటలకు మరింత విలువ జోడించేలా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఇంటింటికీ వెళ్లి వివరించాలని సీఎం కోరారు. శాస్త్రీయ వ్యవసాయంతోనే రైతుకు గిట్టుబాటు అవుతుందని, ప్రకృతి సేద్యాన్ని మరింతగా ప్రోత్సహిస్తున్నామని ఆయన తెలిపారు. దీని వల్ల భూసార రక్షణతో పాటు ఆరోగ్యం కూడా బాగుంటుందన్నారు. ఇప్పటికే ఆయా ఉత్పత్తులకు సర్టిఫికేషన్‌తో పాటు ట్రేసబిలిటీ చేస్తున్నామని, రైతు బజార్లలోనూ ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను మరింత ప్రమోట్ చేయాలన్నారు.
-
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
టీడీపీ ఎమ్మెల్యే తీరుపై చంద్రబాబు సీరియస్-తక్షణం..! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
ఏపీలో ఏకీకృత పెన్షన్ పథకం మార్గదర్శకాలు జారీ..! ఈ ఉద్యోగులకు..! -
AP Govt: ఇక రాష్ట్రమంతా సంజీవని..! చంద్రబాబు కీలక ఆదేశాలు..! -
LPG: ఏపీలో వ్యాపారులకు ఊరట- కమర్షియల్ గ్యాస్ పై సర్కార్ ఉత్తర్వులు..! -
ఏపీ, తెలంగాణలో జనగణన - ఇవ్వాల్సిన వివరాలు, మార్గదర్శకాలు..!! -
ఇంటర్ మూల్యాంకనం పూర్తి, ఫలితాల డేట్ ఫిక్స్ - ఏపీ.. తెలంగాణలో ఇలా..!! -
ఏపీ ప్రజలకు రూ.11వేలు రాయితీతో ఈ సైకిళ్లు, మిస్ చేసుకోకండి -
AP Govt: ఏపీలో ఇవాళ 2.5 లక్షల మందికి ఇళ్లు-టిడ్కో లబ్దిదారులకూ..! -
చంద్రబాబుపై మూడు పిటిషన్లు- హైకోర్టు కీలక నిర్ణయం..! -
ఆళ్లగడ్డ టీడీపీలో కేబుల్ వార్.. భూమా అఖిల Vs సుబ్బారెడ్డి, బంపర్ ఆఫర్ తో చర్చ!











Click it and Unblock the Notifications