ఏపీలో బీచ్ కు వెళ్లాలంటే ఛార్జీ కట్టాల్సిందే. ! ఈ 5 చోట్ల ఎప్పటి నుంచి అంటే ?
దాదాపు వెయ్యి కిలోమీటర్ల సముద్ర తీరం కలిగిన ఏపీలో స్థానికులతో పాటు ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి వచ్చే పర్యాటకులు ఇప్పటివరకూ ఎలాంటి ఛార్జీలు లేకుండా బీచ్ లను సందర్శించే వారు. కానీ ఇకపై ఈ అవకాశం ఉండకపోవచ్చు. ఇకపై యూజర్ ఛార్జీలు చెల్లిస్తేనే బీచ్ లకు ఎంట్రీ ఇచ్చేలా ప్రభుత్వం రూల్స్ ను సిద్దం చేస్తోంది. దీంతో బీచ్ లకు వెళ్లాలనుకునే వారికి ఇకపై జేబుల చిల్లు తప్పకపోవచ్చు.
ఏపీలోని ఎంపిక చేసిన ఐదు బీచ్ లలో జనవరి 1 నుంచి పర్యాటకులకు యూజర్ ఛార్జీలు వసూలు చేయాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. ఇందులో బాపట్లలోని సూర్యలంక బీచ్, ప్రకాశం జిల్లాలోని రామాయపట్నం బీచ్, నెల్లూరు జిల్లాలోని మైపాడు బీచ్, కాకినాడ జిల్లాలోని కాకినాడ బీచ్, వైజాగ్ లోని రుషికొండ బీచ్ ఉన్నాయి. ఇన్నాళ్లు వీటిలో ఉచితంగా వెళ్లి సందడి చేసిన పర్యాటకులు ఇకపై యూజర్ ఛార్జీలు చెల్లిస్తేనే ఎంట్రీ కల్పిస్తారు.

రాష్ట్రంలో బీచ్ లను అభివృద్ధి చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం దశల వారీగా సుందీకరణ పనులు చేపట్టబోతోంది. వీటిలో ముందుగా ఈ ఐదు బీచ్ లలో సౌకర్యాలను అభివృద్ధి చేయడంతో పాటు సుందీకరిస్తారు. డిసెంబర్ 31 నాటికి ఈ పనులు పూర్తి చేసి జనవరి 1 నుంచి బీచ్ లలో ఎంట్రీ ఫీజు విధిస్తారు. ఇలా వసూలు చేసిన ఛార్జీల్ని తిరిగి అదే బీచ్ లో ఖర్చు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు పర్యాటక మంత్రి కందుల దుర్గేష్ తాజాగా వెల్లడించారు. ప్రతీ పర్యాటకుడి నుంచి రూ.15 నుంచి రూ.20 వరకూ ఈ ఛార్జీలు ఉంటాయని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications