ఏపీలో మత్సకారుల ఖాతాల్లో 20 వేలు- డేట్ ఫిక్స్..!
ఏపీలో మత్సకారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇవాళ అమరావతిలోని వెలగపూడి సచివాలయంలో జరిగిన కేబినెట్ భేటీలో ప్రభుత్వం మత్సకారులకు వేసవిలో చేపల వేట సందర్భంగా ఇచ్చే పరిహారంపై చర్చించింది. ఈ పరిహారం ఎప్పుడు విడుదల చేయాలన్న దానిపై కీలక నిర్ణయం తీసుకుంది. అలాగే మత్సకారులకు సీఎం చంద్రబాబు స్వయంగా ఈ పరిహారం ఇంటికి వెళ్లి ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నారు.
ఏపీలోని తూర్పు తీర ప్రాంతంలో చేపల వేట నిన్న అర్ధరాత్రి నంచి అమల్లోకి వచ్చింది. అర్ధరాత్రి నుంచి 61రోజుల పాటు ఈ నిషేధం అమల్లో ఉంటుంది. అంటే జూన్ 15వరకు ఇది కొనసాగనుంది. ఇందుకోసం అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేశారు. మత్స్యసంపద వృద్ధి చెందేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏటా రెండు నెలలపాటు సముద్రంలో చేపల వేటను నిషేధిస్తున్నాయి. మత్స్యకారులు నిబంధనలు ఉల్లంఘించి వేట చేస్తే కేసులు నమోదు చేస్తామని మత్స్యశాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

చేపల వేటపై నిషేధం అమల్లో ఉన్న సమయంలో మరబోట్లు, ఇంజిన్ బూట్లతో మత్సకారులు సముద్రంలో వేటకు వెళ్లకూడదని అధికారులు స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే వారిపై చర్యలు తీసుకుంటారు. అయితే ఇలా నిషేధం విధించడం వల్ల ఉపాధి కోల్పోతున్న మత్సకారుల కోసం కొన్నేళ్లుగా ప్రభుత్వాలు పరిహారం చెల్లిస్తున్నాయి. వేసవిలో ఇలా వేటపై నిషేధం ఉన్న సమయంలో ఒక్కో మత్సకారుడికి రూ.20 వేల చొప్పున పరిహారం చెల్లిస్తారు.
దీంతో ఈ ఏడాది కూడా ప్రభుత్వం ఈ నెల 26న మత్సకారులకు రూ.20 వేల చొప్పున పరిహారం చెల్లించాలని కేబినెట్ లో నిర్ణయించారు. 26న సీఎం చంద్రబాబు స్వయంగా రాష్ట్రంలో ఏదో ఒక మత్సకార గ్రామానికి వెళ్లి ఈ పరిహారం స్వయంగా చెల్లిస్తారని ఇవాళ కేబినెట్ భేటీ అనంతరం రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు.












Click it and Unblock the Notifications