విశాఖకు సర్కార్ గుడ్ న్యూస్..! రాష్ట్రంలోనే తొలి కాలేజ్..!
ఏపీలో వాణిజ్య రాజధాని విశాఖపట్నానికి ఎంతో ప్రాధాన్యం ఇస్తున్న కూటమి సర్కార్.. నగర వాసులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో ప్రకృతి వైద్య సేవలను ప్రజలకు మరింత చేరువ చేయడంలో భాగంగా నగరంలో ఓ కీలక విద్యాసంస్థను ఏర్పాటు చేయబోతోంది. విశాఖలోని విమ్స్ ప్రాంగణంలో దీన్ని ఏర్పాటు చేస్తామని వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రకటించారు.
విశాఖలోని విమ్స్ ప్రాంగణంలో రూ.16.40 కోట్లతో చేపట్టిన నేచర్ క్యూర్ వైద్య కళాశాలలో 2026-27 విద్యా సంవత్సరం నుంచి బ్యాచులర్ ఆఫ్ నాచురోపతి అండ్ యోగా సైన్సెస్ (బీఎన్వైఎస్) కోర్సులో తరగతులు ప్రారంభం కానున్నాయని మంత్రి సత్యకుమార్ ప్రకటించారు. బీఎన్ వైఎస్ కోర్సులో 50 సీట్ల భర్తీకి కేంద్రం ఆమోదం తెలుపనుంది. ఈ కాలేజ్ పక్కనే రూ.14.85 కోట్ల వ్యయంతో 50 పడకలతో చేపట్టిన ఆయుష్ ఇంటిగ్రేటెడ్ ఆసుపత్రి నిర్మాణపనులు కూడా తుది దశలో ఉన్నాయి. ఈ ఆసుపత్రిలో ఆయుర్వేద, హోమియో, యూనాని వైద్య సేవలు త్వరలోనే అందుబాటులోనికి వస్తాయి. వీటి ఆధారంగా కేంద్రం అడ్మిషన్స్ కు అనుమతి ఇస్తుoది.

విశాఖ నగరంలోనే ప్రభుత్వ ఆయుర్వేద మందుల తయారీ, నాణ్యత పరీక్షల ప్రయోగ శాల కూడా రాబోతుందని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. విభజన తర్వాత కేంద్రం 2016-17లో నేచర్ క్యూర్ ఆసుపత్రి, రెండు ఇంటిగ్రేటెడ్ ఆయుష్ ఆసుపత్రుల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. ఆ తర్వాత రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో ఈ ప్రతిపాదనలు పక్కనబెట్టేశారు. ఆ తరువాత కూటమి ప్రభుత్వం అధికారంలోనికి రాగానే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ చొరవతో కాకినాడ ఆసుపత్రికి రూ.7.17 కోట్లు, విశాఖలో ఇంటిగ్రేటెడ్ ఆసుపత్రికి రూ.4.18 కోట్లు, నేచర్ క్యూర్ వైద్య కళాశాలకు రూ.4.08 కోట్లు మంజూరయ్యాయి.

మరోవైపు విశాఖలో నేచర్ క్యూర్ వైద్య కళాశాల ఏర్పాటుకు తగ్గట్లు ప్రత్యేకంగా నేచర్ క్యూర్ ఆసుపత్రి ఏర్పాటుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. 50 పడకలతో ఈ ఆసుపత్రి ఏర్పాటుపై కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది. దీనికి సుమారు రూ.16 కోట్లు కేంద్రం నుంచి రానున్నాయి. అలాగే విశాఖలోని శొంఠ్యాం ప్రాంతంలో సుమారు రూ.6 కోట్లతో ఆయుర్వేద ఫార్మసీ, డ్రగ్ టెస్టింగ్ లేబరోరేటరీల భవన నిర్మాణాలు పూర్తికావచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా సుమారు రూ.5 కోట్లతో పరికరాలు, యంత్రాలు, ఇతర వాటి కొనుగోళ్ల ప్రక్రియ జరగనుంది.
-
అమరావతిలో నిర్మాణాల వేళ 'మాస్టర్ ప్లాన్', కీలక మలుపు..!! -
విశాఖలో వాహనదారులకు హెచ్చరిక .. ఆ పని చేస్తే ఇక కష్టమే -
విద్యుత్ ఛార్జీల పై ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, ఇక కొత్తగా..!! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
ఏపీ విద్యార్ధులకు సర్కార్ గుడ్ న్యూస్..! దేశంలో తొలిసారి..! -
AP Property Tax: ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు బిగ్ అలర్ట్..! ఇంకా ఐదు రోజులే ఆఫర్.. -
విశాఖ-ఢిల్లీ ఇండిగో ఫ్లైట్ లో తీవ్ర సాంకేతిక లోపం -
ఏపీ గురుకుల పాఠశాలలు, కాలేజీల్లో అడ్మిషన్లపై కీలక అప్డేట్..! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..!











Click it and Unblock the Notifications