ఈసారి అమరావతిలోనే రిపబ్లిక్ డే-ఎక్కడో తెలుసా ?
ఏపీలో ఈసారి రిపబ్లిక్ డే వేడుకలు అమరావతి రాజధానిలోనే జరగబోతున్నాయి. గతంలో విజయవాడలో నిర్వహిస్తూ వచ్చిన ప్రభుత్వం ఈసారి మాత్రం అమరావతి రాజధానిలో నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు మొదలయ్యాయి. అధికారులు ఇప్పటికే క్షేత్రస్దాయిలో పర్యటించి రిపబ్లిక్ డే నిర్వహణకు అనువైన స్దలాల్ని వెతుకుతున్నారు. త్వరలో దీనిపై తుది వేదిక ఖరారు కానుంది.
ఏపీ రాజధానిగా అమరావతి ఎంపికై 9 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటివరకూ ఒక్కసారి కూడా రాష్ట్రస్దాయి వేడుకల్ని ఇక్కడ నిర్వహించలేదు. ఈసారి ప్రభుత్వం అమరావతి రాజధాని నిర్మాణం పూర్తి చేయాలని పట్టుదలగా ఉంది. దీంతో ఇప్పటినుంచే రాజధాని సందడి కనిపించేలా రాష్ట్రస్దాయి వేడుకలు నిర్వహించబోతోంది. ఈసారి అమరావతిలో రిపబ్లిక్ డే జరిగితే రాజధానిలో జరిగే తొలి రాష్ట్రస్దాయి వేడుక ఇదే కానుంది. దీంతో ప్రభుత్వం దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది.

అమరావతిలోని రాయపూడి సీడ్ యాక్సెస్ రోడ్డు పక్కన ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే టవర్ల సమీపంలో ఎన్‌ఆర్టీ టవర్స్‌కు వెళ్లే మార్గంలో ఉన్న స్థలాన్ని ఈసారి రిపబ్లిక్ డే వేడుకల నిర్వహణకు పరిశీలిస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఆర్డీఏ కమిషనర్ కాటంనేని భాస్కర్, గుంటూరు జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి, సీఎంవోలో జీఏడీ అధికారి సురేశ్‌కుమార్, ఏఎస్పీ ఏటీవీ రవి, తుళ్లూరు డీఎస్పీ మురళీకృష్ణ దీన్ని పరిశీలించారు. ఈ మేరకు వారు ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు. అనంతరం ప్రభుత్వం అధికారికంగా దీనిపై ప్రకటన చేయనుంది.












Click it and Unblock the Notifications