ఖరీఫ్ రైతులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ - 27 నుంచి మొదలు..!
ఏపీలో ఖరీఫ్ రైతులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ సీజన్ లో రైతుల నుంచి ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి పౌర సరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక ప్రకటన చేశారు. ఈ నెల 27 నుంచి ధాన్యం కొనుగోలు కేంద్రాల్ని తెరుస్తున్నట్లు ఆయన ప్రకటించారు. అప్పటి నుంచే కొనుగోళ్లు ప్రారంభం అవుతాయన్నారు. ఈసారి ఖరీఫ్ సీజన్ లో 51 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి వెల్లడించారు.
2025-26 ఖరీఫ్ సీజన్‌లో రాష్ట్రవ్యాప్తంగా 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్ధేశించిందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.ఆంధ్రప్రదేశ్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధుల సమావేశంలో పాల్గొన్న ఆయన.. ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఉన్న అందర్నీ కలుపుకొని పనిచేస్తున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వం చేసిన 1674 కోట్ల రూపాయల బకాయిలను తీర్చడంలోనూ, ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ మిల్లర్లకు చెల్లించవలసిన 763 కోట్ల రూపాయలు చెల్లించడం ద్వారా కూటమి ప్రభుత్వం చాలా పారదర్శకంగా పనిచేస్తుందన్నారు.

బ్యాంక్ గ్యారంటీలు 1:2 ఏర్పాటు చేస్తామన్నారు. ఇందుకు గాను 35 బ్యాంకు సేవలను ఉపయోగించుకోవచ్చని తెలిపారు. కొన్ని జిల్లాలలో రైస్ మిల్లుల ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని రియల్ టైం గవర్నెన్స్ చేసి చూపిస్తామన్నారు. సంస్కరణలలో భాగంగా వాట్సాప్ ద్వారా రిజిస్ట్రేషన్: "హాయ్" అని పంపగానే కొనుగోలు ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు. రైతుల వద్ద నుంచి ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల నుంచి 48 గంటల్లోనే ప్రభుత్వం రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తామన్నారు.

రేషన్ బియ్యం స్మగ్లింగ్ అరికట్టడంలో రైస్ మిల్లర్లు ప్రభుత్వానికి తోడుగా నిలవాలని ఆయన కోరారు. రైతు కోసం కలిసి పనిచేద్దాం, వ్యవస్థను గౌరవిద్దామన్నారు. గత సంవత్సరం అనుభవంతో, తేమ శాతం కొలిచే యంత్రాలు, రవాణా సదుపాయాలు, క్వాలిటీ గన్నీ బ్యాగులు ముందుగానే సిద్ధం చేసుకోవాలని మిల్లర్లకు సూచించారు. సమస్య పరిష్కారానికి ఎప్పుడు సిద్ధంగా ఉండాలని, పని చేసే విధానం పారదర్శకంగా ఉండాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ సీజన్‌లో 3013 రైతు సేవా కేంద్రాలు, 2061 పీపీసీ ధాన్యం కొనుగోలు కేంద్రాలు, మొత్తం 10,700 సిబ్బందితో ధాన్యం సేకరణకు సిద్ధమవుతున్నట్టు మంత్రి తెలిపారు.
-
ఈ ప్రాంతాల్లో వంట గ్యాస్ సరఫరా పై ప్రభుత్వం కీలక నిర్ణయం, ఇక నుంచి..!! -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం












Click it and Unblock the Notifications