మహిళల ఖాతాల్లో రూ 1500 జమ పై ప్రభుత్వం కీలక నిర్ణయం..!!

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలకు సిద్దమైంది. రేపు ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ప్రస్తుత ఆర్దిక సంవత్సరంలో మిగిలిన నాలుగు నెలల కాలానికి బడ్జెట్ ను ఏపీ ప్రభుత్వం ప్రవేశ పెట్టనుంది. జమిలి ఎన్నికల ప్రచారం వేళ ప్రభుత్వం సంక్షేమ పథకాల పైన ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. ఈ బడ్జెట్ లోనూ సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వనుంది. అదే సమయంలో మహిళల పథకాల పైన క్లారిటీ ఇవ్వనున్నారు.

ప్రభుత్వ బడ్జెట్ లో
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రేపు (సోమవారం) ప్రారంభం కానున్నాయి. కూటమి ప్రభుత్వం వార్షిక బడ్జెట్ ను ప్రవేశ పెట్టనుంది. ఇప్పటికే ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఓట్ ఆన్ ఎకౌంట్ బడ్జెట్ ఈ నెలాఖరుతో ముగియనుంది. దీంతో, అసెంబ్లీ సమావేశాల ప్రారంభం రోజునే బడ్జెట్ ప్రవేశ పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే ఆర్దిక మంత్రి పయ్యావుల రాజ్ భవన్ లో గవర్నర్ తో సమావేశమయ్యారు. బడ్జెట్ ప్రవేశ పెట్టిన తరువాత సభ వాయిదా పడనుంది. అనంతరం బీఏసీ సమావేశం ఏర్పాటు చేసి సమావేశాల నిర్వహణ పైన నిర్ణయం తీసుకోనున్నారు. వారం రోజుల పాటు సమావేశాలు జరిగే అవకాశం ఉంది. ఈ సమావేశంలో బడ్జెట్ తో పాటుగా అనేక కీలక బిల్లులను ప్రభుత్వం ప్రతిపాదించనుంది.

AP Government to present Budget in Assembly on 11th allocations for Super six schemes

మంత్రివర్గం ఆమోదం
ఈ సమావేశాలకు ముందు ఏపీ మంత్రివర్గం సమావేశం కానుంది. బడ్జెట్ కు ఆమోద ముద్ర వేయనుంది. ఈ బడ్జెట్ లో ఈ సారి సూపర్ సిక్స్ హామీల అమలుకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు సమాచారం. కేంద్రం జమిలి ఎన్నికల దిశగా అడుగులు వేస్తున్న వేళ ఏపీ ప్రభుత్వం అప్రమత్తం అయింది. అందులో భాగంగా ఇప్పటికే పెన్షన్ల పెంపు, ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాలను కూటమి ప్రభుత్వం అమలు చేస్తోంది. ఇక, జనవరి నుంచి జన్మభూమి -2, కొత్త రేషన్ కార్డుల పంపిణీ పైన సూత్ర ప్రాయంగా నిర్ణయం తీసుకుంది. ఇక.. మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సుతో పాటుగా ఇతర హామీల అమలుకు సంబంధించి ఈ బడ్జెట్ లో కేటాయింపులు చేస్తారని సమాచారం.

పథకాలకు ప్రాధాన్యత
సూపర్ సిక్స్ హామీల అమలు దిశగా అడుగులు పడుతున్నాయి. 18 నుంచి 59 సంవత్సరాల్లోపు వయసున్న ప్రతి మహిళకు నెలకు రూ.1500 ఈ పథకం ద్వారా ఇస్తామని ఎన్నికలలో కూటమి నేతలు హామీ ఇచ్చారు. ఈ బడ్జెట్ లో ఈ మేరకు నిధుల కేటాయిస్తూ ఈ పథకం అమలు పైనత స్పష్టత ఇస్తారని చెబుతున్నారు. అదే విధంగా మహిళలకు 10 లక్షలు వడ్డీ లేని రుణాలు అందించే అంశంపైనా బడ్జెట్ లో ప్రస్తావన చేయనున్నారు. గతంలో ఈ మొత్తం 3 లక్షలు గా మాత్రమే ఉండేది. నేటి సమావేశంలో రుణాల పైన నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. ఇక, యువతకు ప్రతీ నెలా రూ 3వేల స్టైఫండ్ పైనా స్పష్టత ఇచ్చే ఛాన్స్ ఉంది. వైసీపీ నేతలు ఈ సమావేశాలను బహిష్కరించాలని నిర్ణయించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+