ఏపీలో 13 మంది ఐపీఎస్ ల బదిలీ-పలు జిల్లాలకు కొత్త ఎస్పీలు
ఏపీలో ప్రభుత్వం భారీ ఎత్తున ఐపీఎస్ అధికారుల్ని బదిలీ చేసింది. కీలక స్ధానాల్లో ఉన్న వారితో పాటు పలు జిల్లాల ఎస్పీలు కూడా బదిలీ అయిన వారిలో ఉన్నారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వంలోనీ పలు కీలక విభాగాల్లో ఐపీఎస్ లను మార్చారు. తాజా బదిలీల్లో జరిగిన మార్పులు ఇలా ఉన్నాయి.
ప్రకాశం జిల్లా ఎస్పీగా మాలికా గార్గ్ ను నియమించారు. విజయవాడ ఎస్పీగా రాహుల్ దేవ్ సింగ్, మంగళగిరి బెటాలియన్ కమాండెంట్ గా అజిత వేజెండ్ల, కాకినాడ బెటాలియన్ కమాండ్ గా జీఎస్ సునీల్ ను బదిలీ చేశారు. విశాఖ డీసీపీ వన్ గాగౌతమి సలి, ఇంటెలిజెన్స్ ఎస్పీగా వకుళ్ జిందాల్ ను నియమించారు. రాజమండ్రి అర్బన్ ఎస్పీ గా ఐశ్వర్య రస్తోగికి అవకాశం కల్పించారు. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీ గా షెముషిని నియమించారు.

Recommended Video
కీలకమైన పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీ గా రాహుల్ దేవ్ శర్మను ప్రభుత్వం నియమించింది. ఆక్టోపస్ ఎస్పీ గా కోయ ప్రవీణ్ కు అవకాశం దక్కింది ఏపీ ఎస్పీ విజయనగరం బెటాలియన్ కామెందెంట్ గా విక్రాంత్ పాటిల్ ను నియమించారు. డిజిపి ఆఫీస్ లో అర్ఎం గా అమ్మిరెడ్డిని నియమించారు. డిజిపి కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని మరో ఐపీఎస్ నారాయణ నాయక్ కు ప్రభుత్వం ఆదేశాలు పంపింది. ఈ మధ్య కాలంలో జరిగిన రెండో భారీ బదిలీలు కావడంతో ఈ నియామకాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. పాలనాపరమైన మార్పుల్లో భాగంగానే ఈ బదిలీలు జరిగినట్లు చెప్తున్నారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications