చంద్రబాబు గెస్ట్ హౌస్ అటాచ్ , చాలా ఉంది - సజ్జల సంచలన వ్యాఖ్యలు..!!
అమరావతి కరకట్టపై చంద్రబాబు ఉంటున్న నివాసాన్ని అటాచ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. దీని పైన టీడీపీ నేతలు ప్రభుత్వం పైన ఆరోపణలు చేస్తున్నారు. అమరావతిలో జరిగిన అక్రమాలపైన విచారణ చేసిన సీఐడీ నివేదిక మేరకు ఏపీ ప్రభుత్వం ఈ ఉత్తర్వులు జారీ చేసింది. మాజీ మంత్రి నారాయణ బంధువల ఆస్తులు అటాచ్ చేస్తున్నారు. ఇదే సమయంలో ఈ మొత్తవ వ్యవహారం పైన ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు.

ఎలా ఉంటున్నారు
కరకట్టపైన లింగమనేని గెస్ట్ హౌస్ లో చంద్రబాబు ఎలా ఉంటున్నారని సజ్జల ప్రశ్నించారు. అగ్రిమెంట్ లేకుండా..అద్దె చెల్లించకుండా ఎలా ఉండగలుగుతున్నారో చెప్పాలని డిమాండ్ చేసారు. అద్దె కడుతున్న ట్లుగా ఎక్కడా ఒప్పందాలు లేవని చెప్పారు. ప్రభుత్వం ఇంటి అద్దె అలవెన్స్ చంద్రబాబు పొందుతున్నారని సజ్జల వివరించారు. అక్రమ కట్టడం అని నిరూపణ అయిన తరువాత కూడా చంద్రబాబు అదే ఇంట్లో ఎందుకు కొనసాగుతున్నారని ప్రశ్నించారు. అధికారం పోయిన తరువాత కూడా అక్కడే ఎలా ఉండగులుతున్నారో చెప్పాలన్నారు. వచ్చిన ఫిర్యాదుల విచారణలో అనేక విషయాలు బయటకు వచ్చాయన్నారు. ఇంకా చాలా ఉందంటూ సజ్జల ఆసక్తి కర వ్యాఖ్యలు చేసారు.

అక్రమాలకు చిరునామా
లింగమనేని కరకట్ట పైన చేసిన నిర్మాణం అక్రమాలకు చిరునామాగా అభివర్ణించారు. చంద్రబాబు బరి తెగింపుతో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అమరావతి భూ సమీకరణ మొదలు అన్నింటా అక్రమాలు.. కబ్జాలు జరిగాయని చెప్పుకొచ్చారు. ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణమే లేకుండా అక్రమాలు ఎలా జరిగాయంటూ ప్రశ్నిస్తున్న టీడీపీ నేతల వ్యాఖ్యల పైన స్పందించారు. ఇప్పుడు అమరావతి కూడా లేదని, అదే సమయంలో జరిగిన అక్రమాల పై చర్యలు లేకుండా పోతాయా అని ప్రశ్నించారు. నాటి ప్రభుత్వం లింగమనేని స్థలాల వద్ద రోడ్డు అలైన్ మెంట్ ఎందుకు మార్పు చేసిందని నిలదీసారు. ఇది రాచరిక వ్యవస్థ కాదని.. జరిగింది చాలా ఉందన్నారు. విచారణ ద్వారా అన్ని వాస్తవాలు బయటకు వస్తాయని చెప్పారు.

గేమ్ మార్చేసారు
వచ్చే ఎన్నికల్లో ఓటుకు రెండు వేలు ఇచ్చేందుకు చంద్రబాబు సిద్దం అవుతున్నారని ఆరోపించారు. రాజకీయ ఆట నిబంధనలను మార్చిన నాయకుడు జగన్ అని పేర్కొన్నారు. గడప గడపకు వెళుతున్నప్పుడు ప్రజల నుంచి వస్తున్న అభిమానం వ్యక్తం అవుతోందని చెప్పారు. ప్రతిపక్షాలకు అర్హత లేదని..తోడేళ్ళ మందలా ఏకమై దాడి చేయాలని చూస్తున్నాయని వ్యాఖ్యానించారు. మాయా మారిచ శక్తుల్లా వ్యవహరి స్తున్నాయన్నారు. కోటి 60 లక్షల కుటుంబాలు సంక్షేమ పథకాల వల్ల లబ్ధి పొందాయని వివరించారు. అందరూ అప్రమత్తంగా ఉండాలని సజ్జల హెచ్చరించారు. రాజకీయం అంటే ఎత్తులు, పొత్తులతో కాదని చెప్పుకొచ్చారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నిజాయితీగా అమలు చేయాలన్నారు.












Click it and Unblock the Notifications