లబ్దిదారుల ఖాతాల్లో సీఎం జగన్ నిధుల జమ- ఎవరికి ఏ రోజున..!!
ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలు కొనసాగిస్తోంది. ముందుగానే షెడ్యూల్ ప్రకటించించి ఆ సమయానికి లబ్ది దారులకు నిధులు అందేలా చేస్తోంది. తాజాగా జరిగిన మంత్రివర్గ సమావేశం లో జూలై మాసంలో అమలు చేసే సంక్షేమ పథకాల తేదీలను ఖరారు చేసారు. ఆ తేదీల్లో ముఖ్యమంత్రి జగన్ ఆ పథకాల లబ్దిదారుల ఖాతాల్లో ప్రకటించిన మొత్తం జమ చేయనున్నారు. ఈ నెల 18వ తేదీ నుంచి 28వ తేదీ వరకు పథకాలు అమలు కానున్నాయి.
Recommended Video

ఈ నెలలో వరుసగా పథకాలు
ప్రతీ నెలా సంక్షేమ పథకాల అమలు పైనే ప్రభుత్వం ముందుగానే క్యాలెండర్ విడుదల చేస్తోంది. ఈ నెలలో అమలు చేసే పథకాలపైన మంత్రివర్గ సమావేశంలో చర్చించి ఆమోద ముద్ర వేసారు. అందులో భాగంగా జూలై 18న జగనన్న తోడు నాలుగో ఏడాది తొలి విడత కార్యక్రమం నిర్వహించనుంది. 5.1 లక్షల మందికి రూ 510 రుణాలు ఇప్పిస్తూ..వడ్డీ మాఫీ కింద 4.58 లక్షల మందికి రూ 10.03 కోట్లు చెల్లించ నున్నారు. ఈ నెల 21న నేతన్న నేస్తం కింద లబ్దిదారులకు నిధులు జమ చేయనున్నారు. వరుసగా అయిదో ఏడాది ఈ పథకం అమలు ద్వారా 80,686 మందికి దాదాపు రూ 300 కోట్ల మేర ప్రభుత్వం నుంచి లబ్ది అందనుంది.

కేబినెట్ లో నిర్ణయం
ఈ నెల 26న వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం కింద పొదుపు సంఘాల మహిళలకు డబ్బు ప్రభుత్వం జమ చేయనుంది. వరుసగా నాలుగో ఏడాది ఈ నిధులు విడుదల చేయటానికి నిర్ణయించారు. 9.48 లక్షల గ్రూపుల్లోని మహిళలకు ఈ పథకం కింద రే 1353.76 కోట్లు ఇవ్వనున్నారు. ఈ నాలుగేళ్లల్లో ప్రభుత్వం దాదాపు రూ 5 వేల కోట్లు మహిళలకు అందించినట్లు అవుతుంది. ఈ నెల 28న విదేశీ విద్యా దీవెన కింద అర్హులైన లబ్దిదారులకు రూ 50 కోట్ల మేర జమ చేయనున్నారు. నిర్ణయించిన తేదీల్లో మఖ్యమంత్రి జగన్ నిధులు విడుదల చేసేందుకు నిర్ణయించారు. దీంతో పాటుగా పలు కీలక నిర్ణయాలకు ఏపీ కేబినెట్ ఆమోద ముద్ర వేసింది.
ఎన్నికలకు సంసిద్దత
కేబినెట్ లో సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యమంత్రి జగన్ మంత్రులకు ఎన్నికలకు సిద్దం కావాలని పిలుపునిచ్చారు. మరో ఎనిమిది నెలలే సమయం ఉందని స్పష్టం చేసారు. దీని ద్వారా ముందస్తు ఎన్నికలు లేవని పరోక్షంగా తేల్చి చెప్పారు. అదే సమయంలో మంత్రులు తమ జిల్లాలతో పాటుగా ఇంఛార్జ్ లు గా ఉన్న జిల్లాల్లోనూ ప్రభుత్వ..పార్టీ వ్యవహారాల పైన సమయం కేటాయించాల ని సీఎం జగన్ నిర్దేశించారు. ఎమ్మెల్యేలను కలుపుకుపోవాలని స్పష్టం చేసారు. జగనన్న సురక్షకు ప్రజల్లో మంచి స్పందన వస్తుందని చెప్పుకొచ్చారు. మంత్రులు ..ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకుంటూ ఎన్నికలకు సంసిద్దులు కావాలని సీఎం జగన్ స్పష్టం చేసారు.












Click it and Unblock the Notifications