పెన్షన్లపై తాజా నిర్ణయం, సర్వే - వారికి కోత మార్గదర్శకాలు..!!
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త పెన్షన్ల కోసం పెద్ద సంఖ్యలో లబ్ది దారులు రాష్ట్ర వ్యాప్తంగా నిరీక్షిస్తున్నారు. వీరికి కొత్తవి మంజూరుకు ముందే ప్రస్తుత పెన్షన్ పథకంలో బోగస్ లబ్ది దారులను గుర్తించాలని నిర్ణయించారు. ఇందు కోసం పైలెట్ ప్రాజెక్టుగా సర్వే చేస్తున్నారు. ఇందు కోసం ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. రెండు రోజుల పాటు పెన్షన్ల తనఖీ కొన సాగనుంది. ఇందు కోసం జిల్లాకు ఒక సచివాలయం పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసారు.
సర్వేలో గుర్తింపు
రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల లబ్దిదారుల విషయంలో ప్రభుత్వం తాజాగా సర్వే చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే దాదాపు 65 లక్షల మంది పెన్షన్ల లబ్దిదారులు ఉన్నారు. అదే విధంగా మూడు లక్షలకు పైగా కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయ. ఇదే సమయంలో అర్హత లేకపోయినా పెన్షన్లు పొందుతున్న వారి పైన ప్రభుత్వానికి ఫిర్యాదులు వచ్చాయి. కూటమి ప్రభుత్వం అధికా రం లోకి వచ్చిన తరువాత సచివాలయ సిబ్బంది ద్వారా పెన్షన్లను పంపిణీ చేస్తోంది. ఈ క్రమంలో పలువురు బోగస్ పెన్షన్లు తీసుకుంటున్నట్లు గుర్తించారు. దీంతో, కొత్త పెన్షన్లను మంజూరుకు ముందే బోగస్ పెన్షన్లు తెలిగించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

అనర్హులకు కోత
ఈ మేరకు ముందుగా బోగస్ పెన్షన్లను గుర్తించేందుకు ప్రత్యేకంగా పైలెట్ ప్రాజెక్టుగా రెండు రోజుల పాటు తనిఖీలు చేపట్టనున్నారు. ఎంపిక చేసిన సచివాలయాల పరిధిలో నేడు, రేపు(9,10)తేదీ ల్లో 4 బృందాలు ఏకకాలంలో సర్వే నిర్వహించేలా కసరత్తు చేసింది. ఇందు కోసం ప్రతీ జిల్లాకు ఒక సచివాలయాన్ని ఎంపిక చేశారు. పైలెట్ ప్రాజెక్టులో వచ్చే ఫీడ్ బ్యాక్‌ను బట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 15,004 గ్రామ, వార్డు సచివాలయాల్లోనూ సర్వే చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. వచ్చిన ఫిర్యాదులను జిల్లా అధికారులు సంబంధిత సచివాలయాల ద్వారా వెరిఫై చేయించనున్నారు. ఇందు కోసం ప్రత్యేకంగా 13 ప్రశ్నలను సిద్దం చేసారు. వీటి ఆధారంగా వారిలో వాస్తవంగా అర్హులు ఎవర.. అర్హత లేకపోయినా పెన్షన్ ఎలా అందుకుంటున్నారనే సమాచారం రాబట్టనున్నారు.
ఏరివేత - ఆ తరువాతనే
పింఛన్ల తనిఖీలకు సంబంధించి షెడ్యూల్, విది విధానాలను సెర్ప్ ఉత్తర్వులు జారీ చేసింది. తనిఖీల్లో సచివాలయ సిబ్బందిని కాకుండా పక్క మండలానికి చెందిన సిబ్బందిని నియమిస్తూ ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. సర్వే వివరాలను లబ్దిదారులను కలిసిన సమయంలో యాప్ ద్వారా సేకరించనున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన ప్రశ్నల కు అనుగుణంగా సమాచారం తీసుకోవాల్సి ఉంటుంది. ఆ తరువాత పింఛన్‌దారుని ఫొటో క్యాప్చర్ చేయాల్సి ఉంటుందని ఉద్యోగులకు ప్రభుత్వం సూచించింది.ఈ పైలెట్ ప్రాజెక్టు రిపోర్టుకు అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా అనర్హుల ను గుర్తించాలని భావిస్తున్నారు. ఆ తరువాత కొత్త పెన్షన్ల మంజూరు పైన ప్రభుత్వం నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది.
-
విద్యుత్ ఛార్జీల పై ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, ఇక కొత్తగా..!! -
ఏపీ విద్యార్ధులకు సర్కార్ గుడ్ న్యూస్..! దేశంలో తొలిసారి..! -
AP Property Tax: ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు బిగ్ అలర్ట్..! ఇంకా ఐదు రోజులే ఆఫర్.. -
14కు మార్కాపురం బస్సు ప్రమాద మృతులు.. ఎక్స్ గ్రేషియా ప్రకటించిన సీఎం చంద్రబాబు! -
ఏపీ గురుకుల పాఠశాలలు, కాలేజీల్లో అడ్మిషన్లపై కీలక అప్డేట్..! -
మార్కాపురం బస్సు ప్రమాదం..సీఎం చంద్రబాబు,లోకేష్ తో పాటు మంత్రుల దిగ్భ్రాంతి -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications