రైతుల ఖాతాల్లోకి 'అన్నదాత సుఖీభవ' నిధులు, తాజా నిర్ణయం..!!

ఏపీ ప్రభుత్వం మరో పథకం అమలుకు సిద్దమైంది. ఇప్పటికే తల్లికి వందనం అమలు చేయటం తో ఇక, రైతులకు ఇచ్చిన హామీ అన్నదాత సుఖీభవ పైన ఫోకస్ చేసింది. కేంద్రం అమలు చేస్తు న్న పీఎం కిసాన్ తో పాటుగా ఈ పథకం అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్రం పీఎం కిసాన్ ప్రతీ ఏటా మూడు సార్లు రైతుల ఖాతాల్లో నిధులు జమ చేస్తోంది. అదే సమయంలో ఏపీ ప్రభుత్వం మూడు విడతలుగా అన్నదాత సుఖీభవ నిధులను విడుదల చేయనుంది. అర్హుల జాబితా పైన తుది కసరత్తు చేస్తున్న ప్రభుత్వం .. తొలి విడత నిధుల విడుదలకు ముహూర్తం ఖరారు చేసింది.

ఖాతాల్లో నిధులు
కూటమి ప్రభుత్వం మరో ప్రధాన ఎన్నికల హామీ అన్నదాత సుఖీభవ అమలు దిశగా తుది కసర త్తు జరుగుతోంది. తొలుత పీఎం కిసాన్ తో పాటుగా ఈ నెల 20వ తేదీన తొలి విడత అన్నదాత సుఖీభవ నిధులు విడుదల చేయాలని ఏపీ ప్రభుత్వం భావించింది. అయితే, పీఎం కిసాన్ నిధుల విడుదల వాయిదా పడింది. దీంతో.. ఏపీ ప్రభుత్వం సైతం నిధులు విడుదల చేయలేదు. కాగా, ఈ నెల 30న పీఎం కిసాన్ నిధుల విడుదలకు కేంద్రం ముహూర్తం ఖరారు చేసినట్లు సమాచారం. అదే రోజున ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ తొలి విడత నిధుల విడుదలకు నిర్ణయించినట్లు అధికార వర్గాల సమాచారం. దీని పైన ప్రభుత్వం నుంచి అధికారిక నిర్ణయం రావాల్సి ఉంది. ఇక, ఇప్పటికే పథకానికి అర్హులైన రైతుల జాబితాను ప్రభుత్వం సిద్దం చేసింది.

ap-govt-chances-to-release-anadata-sukhibava-funds-on-30th-of-this-month

అర్హుల జాబితా
అన్నదాతా సుఖీభవ పథకం ఎంపికలో ప్రభుత్వం అర్హుల ఖరారు పైన జిల్లాల నుంచి సమాచారం సేకరిస్తోంది. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా అన్నదాతా సుఖీభవ పథకానికి 45,64,005 మంది రైతులు అర్హత సాధించినట్లు తెలిసింది. వారిలో 44,30,149 మంది రైతుల ఇకెవైసి పూర్తి కాగా.. 1,20,148 మందికి సంబంధించి ఇకెవైసి పెండింగ్‌ ఉంది. చివరి సారిగా 2024 జనవరిలో 53.58 లక్షల మంది రైతుల ఖాతాలో సొమ్ము జమ చేసింది. దీంతో పోలిస్తే ప్రస్తుతం 7.94 లక్షల మందికి తగ్గినట్లు తెలుస్తోంది. సాంకేతిక సమస్యలు, రెవెన్యూ చిక్కులు ఎదురవడంతో లక్షలాది మంది రైతుల వివరాలు పెండింగ్‌లో పెట్టినట్లు సమాచారం. గత వైసిపి ప్రభుత్వం లో చేపట్టిన భూ సమగ్ర సర్వే సందర్భంగా అనేక భూ సమస్యలు తలె త్తాయి. అవి ఇప్పటికీ అపరిష్కృతంగానే ఉండడంతో అన్నదాతా సుఖీభవకు దరఖాస్తు చేసేందు కు ఆటంకంగా మారింది.

ఇలా చెక్ చేసుకోండి
గత ప్రభుత్వం డి పట్టా, ఆర్‌ఒఎఫ్‌ఆర్‌ సాగుదారులకు రైతు భరోసా వర్తింప జేసినా, అన్నదాతా సుఖీభవకు వారిని ప్రభుత్వం అర్హులుగా గుర్తిస్తుందా లేదా అనేది స్పష్టత రావాల్సి ఉంది. ఇక, అర్హుల జాబితాలను వ్యవసాయ శాఖ అధికారుల రైతు సేవా కేంద్రాల కు(ఆర్‌ఎస్‌కే) పంపించారు. దీంతో అర్హుల గుర్తింపు ఈజీ అయ్యింది. వివరాలు లేనివారు మాత్రమే బయోమెట్రిక్ నమోదు చేసుకోవాలని సూచిస్తున్నారు. https://annadathasukhibhava.ap.gov.in/లోకి వెళ్లి రైతులు తమ స్టేటస్ చెక్ చేసుకొనే అవకాశం కల్పించారు. రైతులు తమ ఆధార్ నంబర్ నమోదు చేసి.. పక్కనే ఉండా కాప్చాను ఎంటర్ చేసి సెర్చ్ ఆప్షన్ క్లిక్ చేస్తే అర్హుల వివరాలు కనిపిస్తాయి. అదే సమయంలో ఈకేవైసీ చేసుకోవాల్సిన అవసరం ఉందో, లేదో కూడా తెలుస్తుంది. జాబితాలో పేరు లేకుంగే రైతు సేవా కేంద్రంలో సంప్రదించటం ద్వారా స్పష్టత రానుంది. ఈ నెలాఖరు లోగానే ఈ పథకం అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+