పెన్షన్ల పంపిణీలో కీలక మార్పు - ఈ జిల్లాల లబ్దిదారులకు బిగ్ అలర్ట్..!!
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 1న ప్రధాని మోదీ ఏపీ పర్యటనకు రానున్నారు. భోగాపురం విమానాశ్రయాన్ని ప్రారంభించనున్నారు. ఈ వేడుక అట్టహాసంగా నిర్వహించేందుకు ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఇద సమయంలో ప్రతీ నెలా 1వ తేదీన ప్రభుత్వం పెన్షన్లను పంపిణీ చేస్తోంది. అయితే, ఆగస్టు 1న ప్రధాని పర్యటన కారణంగా పెన్షన్ల పంపిణీ విషయంలో ఏపీ ప్రభుత్వం కొన్ని జిల్లాల్లో మార్పు చేసింది. ఈ మేరకు మార్గదర్శకాలు జారీ అయ్యాయి.
ఏపీ ప్రభుత్వం నెలా 1వ తేదీన పెన్షన్ల పంపిణీ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోంది. లబ్దిదారుల వద్దకే వెళ్లి సచివాలయాల సిబ్బంది పెన్షన్లు అందిస్తున్నారు. కాగా.. ఆగస్టు 1న పెన్షన్ల పంపిణీ పైన ఏపీ ప్రభుత్వం కీలక మార్పు చేసింది. ఆగస్టు 1న భోగాపురం విమానాశ్రయం ప్రారంభానికి ముహూర్తం గా నిర్ణయించారు. ప్రధాని మోదీ ఈ విమానాశ్రయాన్ని ప్రారంభించనున్నారు. దీంతో.. ఆ రోజున ఈ ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మంత్రులకు కీలక బాధ్యతలు అప్పగించింది. ఈ క్రమంలోనే ఆగస్టు 1వ తేదీన ఇచ్చే సామాజిక పింఛన్లను ఈసారి రెండు రోజుల ముందే పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఈ ముందస్తు పంపిణీ నిర్ణయంతో లక్షలాది మంది వృద్ధులు, దివ్యాంగులకు ఊరట లభించనుంది.

ఏపీ ప్రభుత్వం తాజా మార్గదర్శకాలు
ప్రధాని పర్యటన.. భోగాపురం విమానాశ్రయం ప్రారంభం దృష్ట్యా పరిపాలనా యంత్రాంగం బిజీగా ఉండనుండటంతో, జూలై 30వ తేదీనే పెన్షన్ల పంపిణీ ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. జూలై 29 కల్లా నగదు ఉపసంహరణ పూర్తి చేయాలని స్పష్టం చేసింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాల్లో ఈ ముందస్తు పంపిణీ జరగనుంది. మొత్తం 11.98 లక్షల మంది లబ్ధిదారుల కోసం ప్రభుత్వం రూ.514.42 కోట్లను సిద్ధం చేసింది. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది సమన్వయంతో నేరుగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి నగదు అందజేయనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది.












Click it and Unblock the Notifications