మరో 340 మద్యం దుకాణాలు - బ్రాండ్లు, ధరల పై తాజా ఆదేశాలు..!!

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. తక్కువ మార్జిన్ తో నష్ట పోతున్నామని మద్యం వ్యాపారుల కోసం చంద్రబాబు మార్జిన్ పెంపుకు ఆమోదించారు. ప్రస్తుతం ఇస్తున్న 10.5 శాతం మార్జిన్ ను 14 శాతానికి పెంచేందుకు అనుమతించారు. అదే విధంగా రాష్ట్రంలో కొత్తగా కల్లు గీత కులాలకు 340 షాపుల కేటాయింపుకు వారంలోకా నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. మద్యం బ్రాండ్ల, ధరల పైన ముఖ్యమంత్రి అధికారులు స్పష్టంగా తేల్చి చెప్పారు.

కొత్తగా మద్యం దుకాణాలు
మద్యం లైసెన్సీలకు మార్జిన్ ను 14 శాతానికి పెంచుతూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గతంలో ఇచ్చిన హామీ మేరకు 10 శాతం మద్యం షాపులను గీత కులాలకు కేటాయించడంపైనా ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు తాజాగా ఆదేశాలు ఇచ్చారు. వారం రోజుల్లోగా వారికి 340 షాపుల కేటాయింపుల పైన నోటిఫికేషన్ జారీ కానుంది. గౌడ, యాత, సోంది, శెట్టిబలిజ, ఈడిగ, గామల్ల, కలాలీ, శ్రీశయన, శెడిగ, గౌండ్ల కులాలకు వీటిని కేటాయిస్తారు. ఒకరికి ఒక షాపు మాత్రమే కేటాయిస్తారు. ఈ షాపుల కాలపరిమితి 2026 సెప్టెంబరు 30 వరకు ఉంటుంది. వీరికి 50 శాతం లైసెన్సు ఫీజుతోనే షాపులు కేటాయించనున్నారు.

AP govt decided to hike liquor licensees margin up to 14 percent permission for 340 new shops

రూ 99 మద్యం కు డిమాండ్
ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షలో రూ 99 మద్యం అమ్మకాల పైన ప్రత్యేకంగా చర్చ జరిగింది.
క్వార్టర్‌ రూ.99 మద్యం అందుబాటులోకి తేవడంతో అనుకున్న స్థాయిలో ఆదాయం రావడం లేదని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. 21 శాతం అమ్మకాలు అవే ఉన్నాయని నివేదిక సమర్పించారు. మిగిలిన 72 శాతం మద్యం బ్రాండ్ల ధరలు పొరుగు రాష్ట్రాల కంటే తక్కువగా అందిస్తున్నా.. అమ్మకాలు తక్కువగా ఉన్నాయని చెప్పుకొచ్చారు. అయితే, ప్రభుత్వానికి వచ్చే ఆదాయం తగ్గినా తక్కువ రేటు మద్యం అన్ని చోట్లా అందుబాటులో ఉండాలని ఎక్సైజ్ అధికారు లకు ముఖ్యమంత్రి స్పష్టం చేసారు.

ప్రభుత్వం ఆదేశాలు
నకిలీ మద్యం, బెల్టు షాపుల పైన సీఎం అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. నాటుసారా నియంత్రణకు నవోదయం 2.0 పేరుతో జనవరి నుంచి కొత్త కార్యక్రమం ప్రారంభిస్తున్నామని అధికారులు చెప్పారు. రాష్ట్రంలో బ్రాండెడ్ మద్యం అమ్మకాలు రూ 99 బ్రాండ్ కంటే చాలా తక్కువ గా జరుగుతున్నాయని అధికారులు పేర్కొన్నారు. మరి కొన్ని మద్యం కంపెనీలు తాము కూడా రూ 99 మద్యం తయారీకి ముందుకు వచ్చారు. అయితే, రూ 99 మద్యం ఉత్పత్తి మరింత పెరగటం ద్వారా అమ్మకాలు పెరిగి.. పరోక్షంగా ప్రభుత్వ ఆదాయం తగ్గుతుందనే చర్చ సాగుతోంది. దీంతో, ప్రస్తుతానికి రూ 99 మద్యం అమ్మకాలు యథాతధంగా కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+