పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో మార్పులు - ఏపీలోఇక నుంచి ఇలా..!!

పదో తరగతి పరీక్షల్లో మార్పులు చేస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గత ఏడాది ఆరు పేపర్లతో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు నిర్వహించగా, ఈ ఏడాది ఏడు పేపర్ల విధానం అమలు చేయనున్నారు. భౌతిక, రసాయన శాస్త్రాలను కలిపి ఒక పేపర్ గా 50 మార్కులకు, జీవ శాస్త్రం పేపర్ ను 50 మార్కులకు మరో ప్రశ్నాపత్రంగా ఇవ్వాలని నిర్ణయించారు. ఉపాధ్యాయులతో మంత్రి బొత్సా తాజాగా నిర్వహించిన సమావేశం లో ఈ నిర్ణయాలను వెల్లడించారు.

రెండు పేపర్లలో మార్పులు:ఈ రెండు పేపర్లలోనూ 17 చొప్పున ప్రశ్నలు ఉంటాయి, రెండింటిలో కలిసి 35 మార్కులు సాధిస్తే ఉత్తీర్ణ సాధించినట్లు పరిగణిస్తారు. రెండు రోజులు జరిగే సామాన్య శాస్త్రం పరీక్షల్లో ఒక్కో పేపర్ కు రెండు గంటల సమయం ఇస్తారు. మిగతాఅయిదు సబ్జెక్టులు వంద మార్కులకు ఒక్కొక్క పేపరే ఉంటుంది.

AP Govt decided to introduce Seven paers for Tenth Exams from currnet Academic year

ఇప్పటి వరకు ఉన్న కాంపోజిట్ విధానాన్ని రద్దు చేసారు. ప్రస్తుతం 70/30 మార్కుల విధానంలో తెలుగు/ సంస్క్రుతం, ఉర్దూ / హిందీ, ఉర్దూ / అరబిక్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇక నుంచి మొదటి బాష ఒక్కటే వంద మార్కులకు ఉంటుంది. తెలుగు ప్రశ్నాపత్రంలో ఇప్పటి వరకు ఉన్న ప్రతిపదార్ధం, భావం రాసే ప్రశ్నను తొలిగించారు. దీని స్థానంలో పద్యం ఇచ్చి దానిపై ప్రశ్నిలిచ్చే విధానాన్ని తీసుకొచ్చారు.

ఉపాధ్యాయుల సర్దుబాటు:పద్యంపై నాలుగు ప్రశ్నలు ఇస్తారు. ఒక్కోదానికి రెండు చొప్పున 8 మార్కులు కేటాయించారు. రెండో ప్రశ్నగా గతంలో పద్యం , దాని భావానికి సంబంధించి 8 మార్కులు ఉండగా, ఇప్పుడు గద్యాన్ని చదవి,ి నాలుగు ప్రశ్నలకు జవాబులు రాయాల్సి ఉంటుంది. దీనికి ఒక్కో ప్రశ్నకు రెండు చొప్పున ' మార్కులు ఉంటాయి. ఇదే సమయంలో ఉపాధ్యాయుల సర్దబాటుకు సంబంధించి మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

AP Govt decided to introduce Seven paers for Tenth Exams from currnet Academic year

గతంలో నిర్వహించిన హేతుబద్దీకరణ ఆధారంగా అవసరమైన చోటుకు ఉపాధ్యాయులను సర్దుబాటు చేస్తారు. మొదట స్కూల్ కాంప్లెక్స్, మండలం, డివిజన్ ఇలా ప్రాధాన్య క్రమంలో ఈ ప్రక్రియను చేపట్టనున్నారు.

చెల్లింపులపై హామీ:పురపాలక పాఠశాలల్లో అవసరానికి మించి ఉన్న ఉపాధ్యాయులను పురపాలక లేదా దగ్గరలోని ఇతర యాజమాన్య పాఠశాలలకు సర్దుబాటు ఉంటుంది. ఉపాధ్యాయులపై పని భారం పెంచటం, సెక్షన్ పరిణామాన్ని 50 శాతానికి పైగా పెంచటం వల్ల ఉపాధ్యాయ పోస్టులు తగ్గాయని, హేతుబద్దీకరణ ఉత్తర్వులు రద్ద ుచేస్తేనే విద్యా వస్థకు మేలు జరుగుతుందని కొన్ని ఉపాధ్యాయ సంఘాల నేతలు కోరుతున్నారు. రెండు నెలల నుంచి జీతాలు రాని ఉపాధ్యాయులకు వారంలో జీతాలు ఇప్పిస్తామని మంత్రి చెప్పారు. ఇటీవల బదిలీ పొంది రిలీవ్ కాని 450 మంది ఉపాధ్యాయులను త్వరలో రిలీవ్ చేస్తామని మంత్రి బొత్సా వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+