ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - గ్రామ,వార్డు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లు, గజెట్ జారీ..!!
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే పలు రకాల సేవలు అందిస్తున్న వార్డు, గ్రామ సచివాయాల జాబితాలో మరో ముఖ్యమైన ప్రక్రియ ప్రారంభం కానుంది. గ్రామాల్లోనే పౌరసేవలు, రిజిస్ట్రేషన్ ప్రక్రియ వేగవంతం చేసేందుకు వీలు కల్పిస్తూ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇకపై ఆయా గ్రామాల్లోని గ్రామ, వార్డు సచివాలయాలు సబ్ రిజిస్ట్రార్, జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలుగా సేవలందించనున్నాయి.
సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్లు : ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన వార్డు, సచివాలయాల సేవల విషయంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది. భూముల రీసర్వే పూర్తయి, రెవెన్యూ రికార్డులు నూరు శాతం తయారైన 2 వేల గ్రామాలు, వార్డుల్లోని ఆస్తులకు సంబంధించిన రిజిస్ట్రేషన్ల నమోదు ప్రక్రియ ఇక సులభతరం కానుంది.

ఇప్పటి వరకు డిస్ట్రిక్ట్ రిజిస్ట్రేషన్ కార్యాలయాలు (ఆర్‌ఒ) లేక సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో మాత్రమే క్రయ, విక్రయాలకు సంబంధించిన ప్రక్రియ కొనసాగుతుండేది. ఈ నేపథ్యంలో గ్రామాల్లోనే పౌరసేవలు, రిజిస్ట్రేషన్ ప్రక్రియ వేగవంతం చేసేందుకు వీలు కల్పిస్తూ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇకపై ఆయా గ్రామాల్లోని గ్రామ, వార్డు సచివాలయాలు సబ్ రిజిస్ట్రార్, జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలుగా సేవలందించనున్నాయి.
మార్గదర్శకాలు జారీ : ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ తక్షణమే అమల్లోకి వస్తుందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్‌రెడ్డి పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్ యాక్ట్ 1908 (1908 యాక్ట్ నెంబరు 16)లోని సెక్షన్ 7 సబ్ సెక్షన్(1) కింద అందించబడిన అధికారాలను అమలు చేయడంలో ఇతర నోటిఫికేషన్‌లను పాక్షికంగా సవరించినట్లు ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది.
ఇందు కోసం పంచాయతీరాజ్ కమిషనరు, గ్రామ, వార్డు సచివాలయాలశాఖ డైరెక్టరు, రెవెన్యూ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్‌శాఖ కమిషనరుతోపాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ఇప్పటికే వార్డు, గ్రామ సచివాయాలు పలు రకాల సేవలను అందిస్తున్నాయి. ఇప్పుడు రిజిస్ట్రేషన్ల సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది.

ఉచితంగా 11 రకాల సర్టిఫికెట్లు : ఇక తాజాగా ప్రభుత్వం జగనన్న సురక్ష పేరుతో సచివాయాల్లో అన్ని రకాల ప్రజా వినతులను సంతృప్త స్థాయిలో ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తోంది. సచివాలయాల వద్ద నిర్వహించే క్యాంపుల్లో ఈ 11 సర్వీసులకు ఎలాంటి సర్విసు చార్జీలు ఉండవని ప్రభుత్వం పేర్కొంది. అయితే, మ్యుటేషన్ ఆఫ్ ట్రాన్సాక్షన్‌కు సంబంధించి పాస్ పుస్తకాల జారీకి దరఖాస్తుదారులు చెల్లించాల్సిన స్టాట్యుటరీ చార్జీలను మాత్రం వసూలు , స్తారు.
ఇంటిగ్రేటెడ్ సర్టిఫికెట్లు (కుల, నివాస ధ్రువీకరణ పత్రాలు), ఆదాయ ధ్రువీకరణ పత్రం , డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్, మరణ ధ్రువీకరణ పత్రం, మ్యుటేషన్ ఫర్ ట్రాన్సాక్షన్ (భూకొనుగోలు అనంతరం ఆన్‌లైన్‌లో నమోదు), మ్యుటేషన్ ఫర్ కరక్షన్స్ , వివాహ ధ్రువీకరణ పత్రం, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్లు,ఆధార్‌కార్డులో మొబైల్ నంబర్ అప్‌డేట్, కౌలు గుర్తింపు కార్డులు (సీసీఆర్‌సీ), కొత్త రేషన్‌కార్డు లేదా రేషన్‌కార్డు విభజన, ప్రభుత్వ డేటాకు సంబంధించి కుటుంబ వివరాల్లో కొంత మంది సభ్యుల పేర్ల తొలగింపు వంటి సేవలు ఉచితంగా అందించనున్నారు.












Click it and Unblock the Notifications