ఆ ఉద్యోగుల వేతనాల పెంపు.. జగన్ సర్కార్ గ్రీన్ సిగ్నల్

అమరావతి: ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఉద్యోగుల నిరవధిక సమ్మె విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. వారి డిమాండ్లకు అంగీకరించింది. ఇదివరకు రెగ్యులర్ ఉద్యోగులకు తొమ్మిది శాతం ఫిట్‌మెంట్‌ను ఇవ్వడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రభుత్వం చేసిన ప్రతిపాదనకు విద్యుత్ ఉద్యోగుల ఐక్యకార్యాచరణ కమిటీ ప్రతినిధులు తమ అంగీకారాన్ని తెలియజేశారు.

ఇప్పుడు తాజాగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాల పెంపుపైనా జగన్ ప్రభుత్వం మరోసారి సానుకూల నిర్ణయాన్ని తీసుకుంది. వారి వేతనాలను పెంచడానికి అంగీకరించింది. 37 శాతం మేర పెంచింది. వారు తీసుకునే వేతన మొత్తంలో 37 శాతం మేర పెరుగుదల చోటు చేసుకుంటుంది. ఈ మేరకు విద్యుత్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కొద్దిసేపటి కిందటే ఉత్తర్వులు జారీ చేశారు.

AP govt decides to increasing the salaries of outsourcing employees in the electricity dept

ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో విద్యుత్ శాఖలో పని చేస్తోన్న సుమారు 28,000 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు లబ్ది కలుగుతుంది. వారి వేతనం 21,000కు పైగా చేరినట్టయింది. ఉద్యోగులకు గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యాలు కల్పించాలనీ ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై కాంట్రాక్ట్, మ్యాన్ పవర్ ఏజెన్సీలను ప్రభుత్వం ఆదేశించింది.

విద్యుత్‌ ఉద్యోగులు ఈ నెల 17వ తేదీన తలపెట్టిన ఛలో విజయవాడ ఆందోళనను వాయిదా వేస్తున్నట్లు ఇప్పటికే స్ట్రగుల్‌ కమిటీ ప్రకటించిన విషయం తెలిసిందే. పే రివిజన్‌, ఇతర సమస్యలకు సంబంధించి ఉద్యోగులు రాష్ట్రవ్యాప్తంగా సంతకాలను సేకరిస్తోండటం జిల్లా స్థాయిలో కార్మిక శాఖ కమిషనర్లకు తమ అభ్యంతరాలు తెలియజేస్తోండటం వంటి కారణాల వల్ల ఛలో విజయవాడ ఆందోళన వాయిదా పడింది.

ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలను పెంచడానికి ప్రభుత్వం అంగీకరించిన నేపథ్యంలో- ఇక ఛలో విజయవాడ ఆందోళన ఉండకపోవచ్చని చెబుతున్నారు. విద్యుత్ ఉద్యోగుల డిమాండ్లనూ ప్రభుత్వం ఇప్పటికే పరిష్కరించింది. పర్సనల్‌ పే నెలకు రూ.2.40 లక్షల నుంచి రూ.2.49 లక్షల దాకా చెల్లించడంతో పాటు ఫిట్‌మెంట్‌ 9 శాతానికి, మాస్టర్‌ స్కేల్‌పై 3.2 శాతం పెంపుదలను ప్రభుత్వం ఆమోదించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+