అన్నదాత సుభీభవ అమలు పై కీలక అప్డేట్..!!
కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో కీలకమైనది రైతు భరోసా. ప్రతీ ఏటా రైతులకు రూ 20 వేలు ఆర్దిక సాయం అందిస్తామని కూటమి నేతలు హామీ ఇచ్చారు. రైతుభరోసా పేరును అన్నదాత సుఖీభవ గా మార్పు చేసారు. ఈ పథకం అమలుకు సంబంధించి మార్గదర్శకాల పైన ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక సూచనలు చేసారు. అయితే, పథకం అమలు మాత్రం సంక్రాంతి సమయంలో ఉండే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాల సమాచారం.
అమలు కోసం
టిడిపి కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి రెండు నెలలు దాటింది. రైతులకు పెట్టుబడి సాయం కింద ఇస్తామన్న రూ.20 వేల హామీపై విధివిధానాలు సైతం ఖరారు చేయలేదు. దీంతో ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో ప్రభుత్వం ప్రకటించిన 'అన్నదాత సుఖీభవ' అందటం సందేహాంగా మారింది. వరదలకు తీవ్ర నష్టాలను చవిచూసిన రైతులు ప్రభుత్వం ఇచ్చే పెట్టుబడి సాయం కోసం ఎదురుచూస్తున్నారు. గత ప్రభుత్వం పెట్టుబడి సాయం కింద రైతులకు రైతుభరోసా పేరిట ఏడాదికి రూ.13,500 అందించింది. దీనిలో రూ.ఆరు వేలు కేంద్రం, రూ.7,500 రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది.

మార్గదర్శకాలు
కేంద్రం సొమ్ము ఏడాదిలో మూడు విడతలుగా జమైతే, రాష్ట్రప్రభుత్వం మే చివరి వారంలో మొదటివిడతగా రూ.5,500, రెండోవిడతగా జనవరిలో రూ.రెండు వేలు అందించేది. తాము అధికారంలోకి వస్తే పెట్టుబడి సాయం రూ.20 వేలకు పెంచుతామని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది. దీంతో రైతులు ఎంతగానో సంబరపడ్డారు. అధికారం చేపట్టాక 'అన్నదాత సుఖీభవ' పేరుతో పెట్టుబడి సాయం అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఖరీఫ్ సాగు ప్రారంభమై నెలలు గడిచిపోతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో రైతులకు పెట్టుబడి అత్యంత అవసరం. కూటమి ప్రభుత్వం మాత్రం ఇప్పటి వరకూ పెట్టుబడి సాయం కింద అందించే రూ.20 వేలు గురించి నోరువిప్పడం లేదు.
రైతుల నిరీక్షణ
ఇప్పటి వరకూ 'అన్నదాత సుఖీభవ' అమలుకు సంబంధించిన విధివిధానాలపై ఆదేశాలు సైతం ఇవ్వలేదు. అందించే రూ.20 వేలు పెట్టుబడి సాయం ఎన్నివిడతలుగా ఇస్తారో కూడా తేలని పరిస్థితి. గత ప్రభుత్వం రైతుభరోసా భూయజమానులకు తప్ప కౌలురైతులకు అందించలేదు. దీంతో కౌలురైతులు తీవ్రంగా నష్టపోయారు. సాగు చేస్తున్న కౌలురైతులు పెట్టుబడి పెడుతుండగా, ప్రభుత్వం అందించే పెట్టుబడి సాయం మాత్రం భూయజమానుల ఖాతాల్లో వేస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఈ పథకం అమలు పైన మార్గదర్శకాల కోసం రైతులు వేచి చూస్తున్నారు.












Click it and Unblock the Notifications