ఏపీలో VRAలకు గుడ్ న్యూస్..! VRO సర్వీస్ రూల్స్ సవరణ ..!

ఏపీ ప్రభుత్వం (AP Govt) రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో పనిచేస్తున్న గ్రామ రెవెన్యూ సహాయకులకు (VRA) గుడ్ న్యూస్ చెప్పింది. వారు వీఆర్వోగా ప్రమోషన్లు పొందేందుకు వీలుగా నిబంధనల్లో ఇవాళ కీలక సవరణలు చేసింది. ఈ మేరకు ఇవాళ జీవో కూడా జారీ చేసింది. దీని ప్రకారం వీఆర్ఏలు గ్రేడ్ 2 వీఆర్వోలుగా ప్రమోషన్ పొందేందుకు అవసరమైన డిగ్రీ అర్హత సంపాదించేందుకు షరతులతో అనుమతి మంజూరు చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో తెలిపింది.

ఏపీ ఆర్దిక పరిస్ధితి ఇదీ..! తేల్చేసిన చంద్రబాబు- శ్వేతపత్రం విడుదల..!
ఏపీ ఆర్దిక పరిస్ధితి ఇదీ..! తేల్చేసిన చంద్రబాబు- శ్వేతపత్రం విడుదల..!

రాష్ట్రంలో వీఆర్ఏలకు వీఆర్వోలుగా ప్రమోషన్లు పొందేందుకు ఉన్న నిబంధనల్ని సడలిస్తూ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ గ్రామ రెవెన్యూ అధికారుల (VRO) సర్వీస్ రూల్స్, 2008లో సవరణలు చేసింది. ఈ సవరణల ప్రకారం 2023 మార్చి 10న జారీ చేసిన జి.ఓ.ఎం.ఎస్. నెం.104కు ముందు నియమితులైన వీఆర్‌ఏలు ప్రస్తుతం డిగ్రీ అర్హత లేకపోయినా షరతులతో వీఆర్‌వో గ్రేడ్-IIగా నియామకం పొందేందుకు అర్హులు అవుతారు. అయితే వారికి ఓ కీలక షరతు పెట్టింది. ఈ జీవో అమల్లోకి వచ్చిన తేదీ నుంచి ఐదేళ్లలోపు వారు తప్పనిసరిగా డిగ్రీ పూర్తి చేయాలి. నిర్ణీత గడువులో డిగ్రీ అర్హతను సాధించలేకపోతే, వారిని తిరిగి వీఆర్‌ఏ పోస్టుకే తిరిగి పంపిస్తారు.

AP Govt Gives VRAs Five Years to Earn Degree for VRO Grade-II Appointment
DSC పోరులో వైసీపీకి షాక్ ..! తేల్చేసిన ఏపీ హైకోర్టు ..!
DSC పోరులో వైసీపీకి షాక్ ..! తేల్చేసిన ఏపీ హైకోర్టు ..!

చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ (CCLA) ప్రతిపాదనల ఆధారంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం సర్వీసులో ఉన్న ఇంటర్మీడియట్ అర్హతతో పనిచేస్తున్న వీఆర్‌ఏలకు పదోన్నతి అవకాశాన్ని కల్పించడంతో పాటు, ఉన్నత విద్యను పూర్తి చేసుకునేందుకు సమయం ఇవ్వడమే ఈ సవరణ ఉద్దేశమని ప్రభుత్వం జీవోలో పేర్కొంది. ఈ సవరణతో రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది వీఆర్‌ఏలకు వీఆర్‌వో గ్రేడ్-II పోస్టుకు ప్రమోట్ అయ్యేందుకు మార్గం సుగమం కానుంది. అయితే, ఐదేళ్లలోపు డిగ్రీ పూర్తి చేయడం తప్పనిసరి అని ప్రభుత్వం స్పష్టం చేసింది. కాబట్టి వారు డిగ్రీ పూర్తి చేసుకుంటే వీఆర్వో అయినట్లే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+