ప్రభాస్ సినిమా వేళ - సినిమా టికెట్ల ధరల పెంపు : జీవో జారీ -కండీషన్స్ అప్లై....!!

టాలీవుడ్ వర్సెస్ ఏపీ ప్రభుత్వం అన్నట్లుగా సాగిన కోల్డ్ వార్ కు ముగింపు ఇచ్చేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. టాలీవుడ్ ఎంతో కాలంగా కోరుతున్న విధంగా సినిమా టికెట్ల ధరలు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. చిరంజీవి టీంతో జరిగిన చర్చల్లో సీఎం జగన్ ధరల పెంపుకు అంగీకారం తెలిపారు. అయితే, భీమ్లా నాయక్ సినిమా విడుదలకు జీవో జారీ చేయకపోవటం పైన ఆ సమయంలో మరో సారి వివాదం చెలరేగింది. అయితే, నాడు జరిగిన చర్చల్లోని అంశాల ఆధారంగా టిక్కెట్ ధరలను పెంచుతూ..అదే సమయంలో ప్రభుత్వం తమ వైఖరిని స్పష్టం చేస్తూ..ఇప్పటికే చెప్పిన అంశాలను జీవోలో స్పష్టంగా పేర్కొంది.

Recommended Video

    Radhe Shyam, RRR కొత్త హైక్స్ AP Ticket Prices GO| Bheemla Nayak ని ముంచేసారు | Oneindia Telugu
    20 శాతం షూటింగ్ లు ఏపీలో..

    20 శాతం షూటింగ్ లు ఏపీలో..


    అందులో భాగంగా.. 20 శాతం షూటింగ్ లు ఏపీలో జరగాలని సూచించింది. రెమ్యునరేషన్ తో సంబంధం లేకుండా వంద కోట్ల బడ్జెట్ దాటిన సినిమాలకు పది రోజుల వరకు ప్రత్యేకంగా మినహాయింపుల పైన క్లారిటీ ఇచ్చింది. అయిదో షో ప్రదర్శన.. చిన్న సినిమాలకు ప్రోత్సహం పైన ప్రభుత్వం జీవోలో స్పష్టంగా పేర్కొంది. ఇక, టిక్కెట్ల ధరల వ్యవహారంలో నగర పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్‏లుగా సినిమా టికెట్ రేట్లను ప్రభుత్వం నిర్ధారించింది. ఒక్కో ప్రాంతంలో థియేటర్‏లు.. నాలుగు కేటగిరీలుగా విభజించింది. అందులో కనీసం 20,గరిష్టంగా 250 గా రేట్ల నిర్దారించింది.

    ధియేటర్లు..ప్రాంతాల వారీగా ధరలు

    ధియేటర్లు..ప్రాంతాల వారీగా ధరలు


    నాన్ ఏసీ, ఏసీ, స్పెషల్ థియేటర్లు, ముల్టిప్లెక్స్ కేటగిరీలుగా థియేటర్ల వారీగా ధరలు ఫిక్స్ చేసింది. ఒక్కో థియేటర్ లో కేవలం రెండే రకాల టిక్కెట్లు ఉండగా.. ప్రీమియం,నాన్ ప్రీమియంగా రేట్ల నిర్దారణ జరిగింది. అంటే.. ప్రతి థియేటర్లో 25 శాతం సీట్లు నాన్ ప్రీమియంకు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. తాజాగా జారీ చేసిన జీవో ప్రకారం..ఇక నుంచి కనిష్ట - గరిష్ఠ ధరలను ఫిక్స్ చేసింది. ఈ మేరకు కార్పొరేషన్లలో ఏసీ థియేటర్లలో రూ.70, రూ.100 గా ఉండనుంది. కార్పొరేషన్లలో నాన్ ఏసీలో టికెట్ ధరలు రూ.40, రూ.60 గా ఖరారు చేసింది. కార్పొరేషన్ స్పెషల్ థియేటర్లలో రూ.100, రూ.125 గా నిర్ణయించింది. కార్పొరేషన్ మల్టీప్లెక్స్ లో టికెట్ ధర రూ.150, రూ.250 గా డిసైడ్ చేసారు.

    ఇక వివాదం ముగిసినట్లేనా

    ఇక వివాదం ముగిసినట్లేనా


    మున్సిపాలిటీల్లో ఏసీ థియేటర్లలో రూ.60, రూ.80 గా ఖరారు అయింది. మున్సిపాలిటీల్లో నాన్ ఏసీలో టికెట్ ధరలు రూ.30, రూ.50 గా ప్రకటించారు. మున్సిపాలిటీల్లో స్పెషల్ థియేటర్లలో రూ.80, రూ.100 గా ఉండనున్నాయి. మున్సిపాలిటీల్లో మల్టీప్లెక్స్ లో టికెట్ ధర రూ.125, రూ.250 గా ఫిక్స్ చేసారు. నగర పంచాయతీల్లో ఏసీ థియేటర్లలో రూ.50, రూ.70 గా ఉండనున్నాయి. నగర పంచాయతీల్లో నాన్ ఏసీలో టికెట్ ధరలు రూ.20, రూ.40 కాగా, నగర పంచాయతీల్లో స్పెషల్ థియేటర్లలో రూ.70, రూ.90 గా టికెట్ ధరలు ఉండనున్నాయి. అదే విధంగా.. నగర పంచాయతీల్లో మల్టీప్లెక్స్ ల్లో టికెట్ ధర రూ.100, రూ.250 గా ప్రభుత్వం ధరలు ఫిక్స్ చేసింది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+