కొత్త బియ్యం కార్డు కావాలా.. మార్పులకూ అనుమతి- అర్హతలు, ఇలా చేయండి..!!

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త బియ్యం కార్డుల జారీ విధానం సులభతరం చేసింది. ఇప్పటికే రేషన్ లబ్దిదారులకు స్మార్ట్ కార్డులు పంపిణీ చేస్తోంది. గతంలో ఉన్న రేషన్ వాహనాల స్థానంలో తిరిగి రేషన్ షాపులను ప్రారంభించింది. అదే విధంగా రేషన్ షాపులను విలేజ్ మాల్స్ గా కొన్ని ప్రాంతాల్లో నిర్వహించేందుకు కసరత్తు చేస్తోంది. అదే విధంగా కొత్త బియ్యం కార్డు ల మంజూరు విషయంలో ప్రభుత్వం తాజాగా కీలక ఆదేశాలు ఇచ్చింది. దీని ద్వారా కొత్త కార్డుల జారీ విధివిధానాలు ఖరారు చేసింది.

కొత్త బియ్యం కార్డుల జారీ విధానం పై ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది. ఎప్పుడైనా దరఖాస్తు చేసుకునేలా సచివాలయాల్లో కొత్త వ్యవస్థను తీసుకొచ్చారు. డిజిటల్‌ సహాయకులకు ఆయా బాధ్యతలు అప్పగించారు. అదే విధంగా కార్డుల్లో మార్పులు చేర్పులకు అవకాశం కల్పిస్తోంది. ఇందు కోసం భార్యాభర్తల ఇద్దరి ఆధార్, భర్త పాత బియ్యం కార్డు, పెళ్లి ధ్రువీకరణ పత్రం తీసుకుని సచివాలయానికి వెళ్తే ప్రభుత్వ వెబ్‌సైట్‌లో మ్యారేజీ స్ల్పిట్‌ ఆప్షన్‌లో నమోదు చేస్తారు. వారికో నంబరు కేటాయించి దాని ఆధారంగా ఈకేవైసీ చేస్తారు.

ap-govt-latest-decision-for-sanction-of-new-rice-rads-and-distribution-details-here

తర్వాత వీఆర్వో, తహసీల్దారు పరిశీలనకు పంపుతారు. అక్కడి నుంచి అనుమతి పొందగానే కార్డు మంజూరు చేస్తారు. ఇక.. పిల్లల ఆధార్, జనన ధ్రువీకరణ పత్రాలు, తల్లిదండ్రుల బియ్యం కార్డు వివరాలు నమోదు చేసి వీఆర్వో, తహసీల్దారు పరిశీలనకు పంపుతారు. వారు అనుమతించగానే కార్డులో పేర్లు చేర్చే విధంగా కార్యాచరణ ఖరారు చేసారు.

సచివాలయాల్లోనే రేషన్ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని డిసైడ్ చేసారు. కార్డులో చిరునామా మార్పులకు అవకాశం కల్పిస్తున్నారు. అర్హులైన లబ్ధిదారులు గ్రామ, వార్డు సచివాలయాలు, వీఆర్వోలను సంప్రదించాల్సి ఉంటుంది. జనవరి నుంచి జూన్‌ వరకు దరఖాస్తు చేసుకున్న వారికి జులైలో జులై నుంచి డిసెంబరు వరకు దరఖాస్తు చేసుకున్న వారికి జనవరిలో కొత్త బియ్యం కార్డులు అందజేయనున్నారు.

ఇప్పటికే రేషన్ సరకులు అందించడానికి స్మార్ట్ రేషన్ కార్డులు ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. తద్వారా పేదలకు చౌక దుకాణాల సరకులు అందిస్తోంది. స్మార్ట్‌ రేషన్‌ కార్డులను రూపొందించింది. వాటిని లబ్ధిదారులకు ఆగస్టు నుంచే పంపిణీకి శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా ఆయా గ్రామ, వార్డు సచివాలయాలకు పంపిణీ చేసింది. వృద్ధులు, దివ్యాంగుల ఇళ్లకు వద్దకు వెళ్లి ఇచ్చేలా ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ప్రభుత్వం ఈనెల 15 నాటికి పంపిణీ ప్రక్రియ పూర్తి చేయాలని తాజాగా ఆదేశాలిచ్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+