'తల్లికి వందనం' నిధులు పడని వారి కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం, ఇక..!!
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాల అమలుకు ప్రాధాన్యత ఇచ్చింది. ఇప్పటికే నాలుగు ప్రధాన పథకాల అమలు ప్రారంభించింది. అందులో భాగంగా తల్లికి వందనం నిధులు విడుదల చేసింది. అయినా, అర్హత ఉండీ పథకం అందని వారికి ప్రభుత్వం మరో అవకాశం ఇచ్చింది. లబ్దిదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. పరిశీలన తరువాత ప్రభుత్వ నిబంధనల మేరకు అర్హత ఉన్న వారికి వెంటనే నిధులు విడుదల చేయాలని తాజాగా ప్రభుత్వం ఆదేశించింది.
ఏపీ ప్రభుత్వం తల్లికి వందనం పై మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ప్రభుత్వం ఈ పథకం కింద లబ్దిదారులకు నిధులు విడుదల చేసింది. ఈ ఏడాది కొత్తగా బడుల్లో చేరుతున్న వారికి అవకాశం కల్పిస్తూ తాజా మార్గదర్శకాలు ఖరారు చేసింది. తొలి విడతలో 67.27 లక్షల మంది విద్యార్థులకు పథకం అమలుచేశారు. రెండో విడతలో భాగంగా ఒకటో తరగతిలో, ఇంటర్మీడియట్ ఫస్టియర్‌లో చేరిన వారికి నిధులు విడుదల చేస్తామని ప్రభుత్వం గతంలో చెప్పిన విధంగా జమ చేసింది. ఒకటో తరగతిలో 5.5 లక్షలు, ఇంటర్ ఫస్టియర్‌లో 4.7లక్షల మంది విద్యార్థులు చేరారు. వీరికీ పథకం అమలు చేస్తున్నారు.

తాజాగా, ప్రభుత్వం అర్హత ఉండి నిధులు అందని.. లబ్దిదారులను గుర్తించింది. వారికి రూ 325 కోట్లు జమ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. వార్డు - గ్రామ సచివాలయాలకు లబ్దిదారుల నుంచి వచ్చిన అభ్యర్ధనల పైన పరిశీలన జరుగుతోంది. కాగా. తొలి విడతలో డబ్బులు జమ కానివారు, ఒకటో తరగతిలో చేరే పిల్లలు, ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులకు మాత్రం మలి విడతలో నిధులు జమ అయ్యాయి. ఈ క్రమంలో రెండో విడత తల్లికి వందనం వెరిఫికేషన్‌ను అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వం గుర్తించిన అర్హుల ఖాతాల్లో వెంటనే నిధులు జమ చేయాలని ఆదేశించటంతో.. ఈ వారంలోనే లబ్దిదారుల ఖాతాల్లో నిధులు జమ చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications