స్వర్ణ గ్రామం, స్వర్ణవార్డుల్లో కీలక మార్పు-అమల్లోకి కొత్త విధానం..!
ఏపీలోని స్వర్ణ వార్డులు (వార్డు సచివాలయాలు), స్వర్ణ గ్రామాలు( గ్రామ సచివాలయం)లో కీలక మార్పు. రాష్ట్రంలో ఉన్న స్వర్ణ వార్డు, స్వర్ణ గ్రామాల్లో అందుతున్న సేవలపై ప్రజల్లో ఇంకా అసంతృప్తి ఉందన్న ఆరోపణల నేపథ్యంలో వీటిపై పర్యవేక్షణ అవసరమని భావించిన ప్రభుత్వం (ap govt).. మూడంచెల వ్యవస్థను అమల్లోకి తీసుకొచ్చింది. ఇప్పటికే ఈ వ్యవస్ధలో ఉండాల్సిన అధికారుల్ని కూడా నియమించింది.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వేలాది స్వర్ణ వార్డు, స్వర్ణగ్రామాల్లో మూడంచెల వ్యవస్థను అమల్లోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం జిల్లా, మండల, పట్టణ స్దాయిల్లో ఈ వ్యవస్థను అమల్లోకి తెచ్చారు. ఈ వ్యవస్థ కోసమే ప్రత్యేకంగా 2778 అధికారుల్ని ప్రభుత్వం స్వర్ణ వార్డు, స్వర్ణ గ్రామాల్లో నియమించింది. ఈ పర్యవేక్షణ అధికారులుగా వివిధ శాఖల నుంచి డిప్యుటేషన్లపై వచ్చిన వారితో పాటు బదిలీలపై వచ్చిన వారూ ఉన్నారు.

స్వర్ణ వార్డు, స్వర్ణ గ్రామాలపై పర్యవేక్షణ చేసే అధికారులు ఉద్యోగులతో పాటు ప్రభుత్వ పథకాల అమలు బాధ్యతలు తీసుకోవాలి. ఆయా ఆఫీసుల్లో రెగ్యులర్ గా తనిఖీలు చేయాలి. పథకాలు అందరికీ సకాలంలో అందుతున్నాయో లేదో పరిశీలిస్తూ తగు సూచనలు ఇవ్వాలి. అలాగే స్వర్ణ వార్డు, స్వర్ణ గ్రామాల ఉద్యోగులు ముందస్తు అనుమతులు లేకుండా ఇతర శాఖల్లోకి డిప్యుటేషన్లపై వెళ్లకుండా చూడాలి. దీంతో పాటు ఉద్యోగుల హాజరును కూడా పర్యవేక్షించాలి.

అలాగే స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డులకు ప్రభుత్వం పంపుతున్న డబ్బులకు సైతం బాధ్యత వహించాలి. ఉద్యోగులపై ఫిర్యాదులు వస్తే వాటిపై ఉన్నతాధికారులకు నివేదికలు పంపి చర్యలకు సిఫార్సు చేయాలి. అలాగే ఉన్నతాధికారుల నుంచి వచ్చే ఆదేశాల మేరకు ఉద్యోగులపై చర్యల్ని అమలు చేయాలి. అలాగే ప్రతీ స్వర్ణ వార్డు, స్వర్ణ గ్రామాల్లో లాజిస్టిక్స్ ఉండేలా చూసుకోవాలి. అలాగే ప్రభుత్వం ఎప్పటికప్పుడు తీసుకునే ప్రతీ నిర్ణయం అమలు చేసే బాధ్యత వీరిదే.












Click it and Unblock the Notifications