రేవంత్ బాటలోనే ఏపీ ప్రభుత్వం - అనూహ్య నిర్ణయం..!?

ఏపీలో కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. ఉన్నత విద్యా సంస్థల సీట్ల రిజర్వేషన్ విషయంలో తెలంగాణ లో రేవంత్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తరహాలోనే ఏపీ ప్రభుత్వం ముందుకు వెళ్లాలని డిసైడ్ అయినట్లు సమాచారం. స్థానికత - నాన్ లోకల్ కోటా లపైన తెలంగాణ ప్రభుత్వం తాజా మార్పులతో ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పుడు ఏపీ సైతం ఇదే విధానంతో ముందుకు వెళ్లాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

రేవంత్ తరహాలోనే
ఏపీ ప్రభుత్వం సైతం తెలంగాణ లో రేవంత్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తరహాలోనే ఏపీ లోనూ అమలు చేసేందుకు సమాయత్తం అయినట్లు సమాచారం. ఇందు కోసం కొత్త ఉత్తర్వుల జారీ పైన కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. స్థానికత .. నాన్ లోకల్ కోటాలో ఇక నుంచి తెలంగాణ రాష్ట్ర విద్యార్ధులకే అవకాశం దక్కేలా రేవంత్ సర్కార్ నిర్ణయించింది. దీంతో, తెలంగాణలో ఇక ఏపీ విద్యార్ధులు పోటీ పడే అవకాశం ఉండదు. ఇప్పుడు తెలంగాణ నిర్ణయంతో ఏపీ ప్రభుత్వం ఈ అంశం పైన ఫోకస్ చేసింది. అదే తరహా నిర్ణయానికి సిద్దమవుతోంది.

AP Govt likely to issue orders for Reservations quota in Professional colleges as TG Govt Decision

మా సీట్లు మాకే
రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం ఉమ్మడి రాష్ట్రం నుంచి ఉన్నత విద్యలో అన్‌రిజర్వ్‌డ్‌ కోటా అమలు చేస్తున్నారు. అప్పట్లో ఉమ్మడి రాష్ర్టాన్ని 3 రీజియన్లుగా విభజించి ఈ కోటా అమల్లో ఉండేది. ఆంధ్రా ప్రాంతంలో ఆంధ్రా యూనివర్సిటీ(ఏయూ), రాయలసీమలో శ్రీవెంకటేశ్వర యూనివర్సిటీ (ఎస్వీ), తెలంగాణలో ఉస్మానియా యూనివర్సిటీ(ఓయూ)లు ఈ కోటాకు ప్రాతిపదికగా ఉన్నాయి. ప్రతి యూనివర్సిటీలో కన్వీనర్‌ కోటా సీట్లలో 85 శాతం పూర్తిగా ఆ యూనివర్సిటీ పరిధిలోకే వస్తా యి. మిగిలిన 15శాతం సీట్లను అన్‌రిజర్వ్‌డ్‌గా పేర్కొని ఆయా వర్సిటీల పరిధిలోని విద్యార్థులకు కేటాయిస్తారు. విభజన జరిగి పదేళ్లు దాటినందున ఈ కోటా వర్తించదంటూ తెలంగాణ ప్రభుత్వం తాజాగా మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకుంది.

కసరత్తు
తాజా నిర్ణయంలో భాగంగా అన్‌రిజర్వ్‌డ్‌ కోటాలో ఏయూ, ఎస్వీయూను తొలగించింది. దీంతో ఏపీ విద్యార్థులు ఓయూ పరిధి అయిన తెలంగాణలో సీట్లు పొందడానికి అర్హత కోల్పోయారు. తాజాగా తెలంగాణ నిర్ణయంతో ఏపీ ప్రభుత్వం ఇదే తరహాలో నిర్ణయం ప్రకటించనుంది. ఏయూ, ఎస్ వీయూ అన్‌రిజర్వ్‌డ్‌ కోటాలో ఓయూను తొలగించనుంది. దీంతో రాష్ట్రానికి చెందిన సీట్లు రాష్ట్రం లోని వేర్వేరు ప్రాంతాల విద్యార్థులకు మాత్రమే దక్కుతాయి. స్థానికతపైనా ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టత ఇచ్చేలా కసరత్తు జరుగుతున్నట్లు తెలుస్తోంది. కాగా, ఉన్నత విద్యలో సీట్లకు, పునర్విభ జన చట్టానికి సంబంధం లేదనే వాదన వినిపిస్తోంది. కానీ, కోటాపై తెలంగాణ నిర్ణయం తీసుకోవ డంతో ఏపీ విద్యార్థుల ప్రయోజనాల దృష్ట్యా కూటమి ప్రభుత్వం నిర్ణయానికి సిద్దమైంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+