రైతుభరోసా నిధుల జమ పై బిగ్ అప్డేట్..!!

ఏపీ ప్రభుత్వం మరో కీలక హామీ అమలు దిశగా కసరత్తు చేస్తోంది. కూటమి అధికారంలోకి వస్తే రైతు భరోసా నిధులు రూ 20 వేలకు పెంచుతామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి ఏడు నెలలు పూర్తి కావటంతో రైతులు ఈ పథకం అమలు కోసం నిరీక్షిస్తున్నారు. ప్రభుత్వం తాజాగా ఈ పథకం కింద ఎంత మంది రైతులకు నిధులు జమ చేయాల్సి ఉంటుందనే లెక్కలు తేల్చింది. కాగా, కేంద్రం పీఎం కిసాన్ సమ్మాన్ తో కలిపి ఈ పథకం నిధులు జమ చేయాలని భావిస్తోంది. వచ్చే నెలలో అమలు చేసేందుకు సన్నాహాలు ప్రారంభించింది.

ఖాతాల్లో నిధుల జమ
తాము అధికారంలోకి వస్తే ప్రతీ రైతుకు ఏటా రూ 20 వేలు చొప్పున ఆర్దిక సాయం చేస్తామని కూటమి నేతలు హామీ ఇచ్చారు. గతంలో రతు భరోసా పేరుతో వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన ఈ పథకానికి 'అన్నదాతా సుఖీభవ' గా పేరు మార్చారు. అయితే, ఈ పథకం కింద వచ్చే నెలలో అందించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ పథకం అమలుకు విధివిధానాల రూపకల్పనకు కసరత్తు చేస్తోంది. నిజమైన సాగుదారులను పరిగణనలోకి తీసుకుని, అటు భూ యజమానులకు, ఇటు కౌలు రైతులకు ప్రయోజనం కలిగేలా పథకం అమలు చేస్తామని చెబుతున్నారు. కేంద్రం పీఎం కిసాన్‌ కింద ఇచ్చే రూ.6వేలతో పాటు, రాష్ట్ర ప్రభుత్వం రూ.14వేలు కలిపి, మొత్తంగా ఏటా రూ.20వేలు ఇవ్వనున్నారు.

AP Govt planning to deposit Annadata Sukhibava

కేంద్ర నిధులతో కలిపి
కేంద్రం పీఎం కిసాన్ కింద ఫిబ్రవరి మధ్యలో నిధులు విడుదల చేసే అవకాశం ఉంది. ఏపీ ప్రభుత్వం సైతం అదే సమయంలో రైతుల ఖాతాల్లో తాము ఇచ్చిన హామీ మేరకు మిగిలిన నిధుల ను జమ చేయాలని భావిస్తోంది. ఈ మేరకు ఆర్దికంగా సర్దుబాటు పైన ఫోకస్ చేసింది. రైతులు ఈ పథకం అమలు కోసం నిరీక్షిస్తుండటంతో అమలు ప్రక్రియ వేగవంతం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. తాజాగా జరిగిన మంత్రివర్గ సమావేశంలోనూ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం పీఎం కిసాన్ నిధులు అందుతున్న రైతులకే ఈ పథకం అమలు అవుతుందని అధికారు లు చెబుతున్నారు. అయితే, పథకం అమలు అర్హతల పైన ప్రభుత్వం అధికారికంగా స్పష్టత ఇవ్వాల్సి ఉంది.

వచ్చే విద్యా సంవత్సరంలో
ఇక మరో ప్రధాన హామీ 'తల్లికి వందనం' అమలు చేసేందుకు దాదాపు 12వేల కోట్లు ఖర్చవుతుం దని ప్రభుత్వం అంచనా వేస్తోంది. దీనికి సంబంధించి నిధుల సమీకరణ పైన అధికార యంత్రాం గం ఫోకస్ చేసింది. అయితే, వచ్చే విద్యా సంవత్సరంలో ఈ పథకం అమలు చేయాలని తాజాగా జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. జూన్ లో అకడమిక్ కాలెండర్ ప్రారం భం వేళ ఈ నిధులు విడుదల చేసే అవకాశం ఉంది. చదువుకునే పిల్లలు ఎంత మంది ఉంటే అంత మందికీ పథకం అమలు చేస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. దీంతో, ప్రస్తుతం పాఠశాలల్లో చదువుతున్న వారికి హాజరు శాతం హాజరు తప్పనిసరి చేసారు. ఈ పథకం కోసం వచ్చే నెలలో ప్రవేశ పెట్టే బడ్జెట్ లో నిధులు కేటాయించే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+