లక్ష కోట్ల అప్పుకు సిద్దం, ఆశలన్నీ అక్కడే - ఏం జరుగుతోంది.!!

ఏపీ ప్రభుత్వం భారీ బడ్జెట్ ప్రవేశ పెట్టింది. 2025-26 ఆర్దిక సంవత్సరానికి రూ 3.22 లక్షల కోట్ల అంచనాలతో బడ్జెట్ ను ప్రతిపాదించింది. ఇందులోనే నిధుల సమీకరణ పైన ప్రభుత్వ అంచనాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. రుణాల ద్వారా లక్ష కోట్లకు పైగా సమీకరించాలని భావిస్తోంది. కేంద్ర గ్రాంట్లపై కొండంత ఆశ పెట్టుకుంది. ఆదాయ అంచనాలు బడ్జెట్ లో చెప్పిన విధంగా ప్రభుత్వం అందుకోగలదా అనే సందేహాలు ఇప్పుడు మొదలయ్యాయి.

మారుతున్న లెక్కలు
ఏపీ ప్రభుత్వం బడ్జెట్ లో రుణాల గురించి కీలక అంచనాలను వెల్లడించింది. బడ్జెట్ ప్రతిపాదన ల మేరకు 2025-26 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం భారీ మొత్తంలో రుణాలను తీసుకో వాలని నిర్ణయించింది. రూ 3.22 లక్షల కోట్ల బడ్జెట్‌లో రుణాల ద్వారానే 1,04,382 కోట్లు సేకరించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. ఇందులో రిజర్వ్‌ బ్యాంకు నిర్వహించే సెక్యూరిటీల వేలం ద్వారానే 80,456 కోట్ల రుణాలు తెచ్చుకోవాలని నిర్ణయించారు. అలాగే కేంద్రం నుంచి వివిధ పథకాల కింద మరో 21,700 కోట్లు రుణంగా వస్తుందని అంచనా వేశారు. డిపాజిట్‌ ట్రాన్సాక్షన్‌ ద్వారా 700 కోట్లు, ఇతర రుణాల ద్వారా 1,500 కోట్లు, లోన్స్‌ అడ్వాన్సుల ద్వారా 26 కోట్ల రూపాయల వరకు వస్తాయని ప్రతిపాదించారు.

AP Govt plans for one lakh crore new debt in 2025-26 as Budget projections

లక్ష కోట్లు అప్పు చేస్తాం
2024-25 లో గత ఏడాది బహిరంగ మార్కెట్‌ ద్వారా 71 వేల కోట్లు రుణ సమీకరణ చేయాలని నిర్ణయించగా, ప్రస్తుతం ఆ సంఖ్య 80 వేల కోట్ల వరకు చేరిపోయింది. ఏపీ ప్రభుత్వం కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లు, పన్నేతర ఆదాయంపై కొండంత ఆశలు పెట్టుకున్నట్లు స్పష్టం అవుతోంది. గత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రానికి రూ.7,432 కోట్ల పన్నేతర ఆదాయం వచ్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సవరించిన అంచనాల ప్రకారం రూ.7,018 కోట్లు వచ్చే ఛాన్స్ ఉంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో పన్నేతర ఆదాయం రూ.19,119 కోట్లు వస్తుందని ప్రభుత్వం అంచనా వేసింది. భూముల అమ్మకం, ఎర్రచందనం అమ్మకం... ఈ రెండే పన్నేతర ఆదాయానికి ప్రధాన మార్గాలు గా మారాయి. దీంతో, ఈ అంచనాలు ఏ మేర సాధిస్తారనేది ఆసక్తి కరంగా మారుతోంది.

అప్పుల లెక్కలు
ఏపీ ప్రభుత్వం కేంద్రం ఇచ్చే గ్రాంట్స్‌ ఇన్‌ ఎయిడ్‌పై కూడా భారీగా ఆశలు పెట్టుకున్నారు. ప్రస్తు త ఆర్థిక సంవత్సరం సవరించిన అంచనాల ప్రకారం గ్రాంట్స్‌ ఇన్‌ ఎయిడ్‌ రూపంలో వచ్చేది రూ.21,966 కోట్లు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో వీటిని అమాంతం పెంచి... రూ.32,384 కోట్లుగా చూపించారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో అన్ని మార్గాల్లో రూ.1,04,382 కోట్ల అప్పులు చేస్తామ ని బడ్జెట్లో పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విడుదల చేసిన శ్వేతపత్రంలో పేర్కొన్న అప్పులు బడ్జెట్‌లో ప్రస్తావించలేదు. కానీ, అప్పులపై చెల్లించాల్సిన వడ్డీలు, అసలు లెక్కలు మాత్రం స్పష్టంగా వివరించారు. భారీగా ప్రతిపాదించిన బడ్జెట్ లో లక్ష కోట్లకు పైగా అప్పు చేస్తామని చెప్పటం ఇప్పుడు కొత్త చర్చకు కారణమవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+