సెప్టెంబర్ 1 పెన్షన్ల పై ప్రభుత్వం కీలక ప్రకటన - కొత్తగా వీరికీ పంపిణీ..!!
ఏపీ ప్రభుత్వం ప్రతీ నెలా పెన్షన్ల పంపిణీ ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తోంది. కొత్త పెన్షన్ల పంపిణీ పైనా ఫోకస్ చేసింది. కొత్తగా మూడు లక్షల పెన్షన్లను పంపిణీ దిశగా కసరత్తు కొనసాగుతోంది. ప్రతీ నెలా ఇంటి వద్దే లబ్దిదారులకు పెన్షన్ అందిస్తున్న ప్రభుత్వం.. సెప్టెంబర్ 1న అందించే వాటి పైన కీలక ప్రకటన చేసింది. అదే విధంగా కొత్త పెన్షన్లను మంజూరు అయిన లబ్దిదారులకు వచ్చే నెల ఒకటో తేదీ నుంచి అందించేందుకు నిర్ణయించారు.
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పెన్షన్లను పెంచి ప్రతీ నెలా ఒకటో తేదీన పంపిణీ చేస్తున్నారు. ఈ పథకాన్ని ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోంది. కాగా, కొత్త పెన్షన్ల కోసం పెద్ద సంఖ్యలో లబ్ది దారులు నిరీక్షిస్తున్నారు. అందులో భాగంగా తొలుత మూడు లక్షల మందికి ఆమోదం తెలపాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందు కోసం క్షేత్ర స్థాయి కేటగిరీల వారీగా అర్హుల వివరాలను సేకరిస్తోంది. విధాన పరమైన నిర్ణయం తీసుకున్న తరువాత వారి నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. కాగా, సెప్టెంబర్ 1వ తేదీన పంపిణీ చేసే పెన్షన్ల కోసం ప్రభుత్వం రూ 2,693.90 కోట్లు విడుదల చేసింది. సెప్టెంబర్ 1న 61.92 లక్షల మందికి పెన్షన్లు పంపిణీ చేయనున్నారు. కాగా ఒకటే తేదీ నుంచి కొత్తగా 6,268 మందికి స్పౌజ్ పెన్షన్లు అందిస్తున్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు.

ప్రభుత్వం తాజా నిర్ణయం
ఏపీ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబర్ నెలలో 61,92,396 మంది పింఛన్‌దారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేసేందుకు సిద్దమైనట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చెప్పారు. 1వ తేదీ ఉదయం నుంచే రాష్ట్ర వ్యాప్తంగా ఈ పింఛన్లను పంపిణీ చేస్తామని... కొత్తగా మంజూరైన 6,268 వితంతు లబ్ధిదారులకు సెప్టెంబర్ 1న పింఛన్లు అందించేందుకు ప్రభుత్వం రూ.2.51 కోట్లను విడుదల చేసినట్టు మంత్రి తెలిపారు. భర్త మరణించిన అనంతరం అర్హత కలిగిన జీవిత భాగస్వామి కి సామాజిక భద్రత కల్పించాలనే ఉద్దేశంతో స్పౌజ్ పింఛన్లను ప్రభుత్వం అందిస్తోందన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు పింఛన్ల కోసం ఈ నెల విడుదల చేసిన నిధులతో కలుపుకుని రూ.73,506 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేసిందన్నారు. నిరుపేదల సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పింఛన్ నిధులను ప్రతి నెలా 1వ తేదీనే లబ్ధిదారులకు అందిస్తోందని ... అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేసారు.












Click it and Unblock the Notifications