ఇక ఆ భూములు వారికే, రిజిస్ట్రేషన్ హక్కులు - ప్రభుత్వం నిర్ణయం, మార్గదర్శకాలు..!!

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సుదీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉన్న భూముల వ్యవహారం పై స్పష్టత ఇచ్చింది. ఫ్రీహోల్డ్‌ పరిధిలోకి వచ్చే భూముల రిజిస్ట్రేషన్లకు అవకాశం కల్పించనుంది. ఈ మేరకు మార్గ దర్శకాలను ఖరారు చేసేందుకు రెవిన్యూ శాఖ తుది కసరత్తు చేస్తోంది. ఒకటి రెండు రోజుల్లోనే అధికారికంగా ఉత్తర్వులు జారీ కానున్నాయి. దీని ద్వారా దాదాపు రెండేళ్ల కాలంగా కొనసాగుతున్న నిరీక్షణ కు తెర పడనుంది.

ఏపీ ప్రభుత్వం ఫ్రీ హోల్డ్ భూముల పైన కీలక ఉత్తర్వులు జారీ చేయనుంది. ఈ మేరకు రెవిన్యూ శాఖ తుది కసరత్తు చేస్తోంది. ఫ్రీహోల్డ్‌ పరిధిలోకి వచ్చే భూముల రిజిస్ట్రేషన్లకు అవకాశం కల్పించనుంది. పక్కాగా ఫ్రీహోల్డ్‌ భూముల రిజిస్ట్రేషన్లకు విధివిధానాలు ప్రకటిస్తూ రెవెన్యూ శాఖ ఉత్తర్వులు ఇచ్చేందుకు రంగం సిద్ధం అవుతోంది. ఫ్రీహోల్డ్‌ భూముల రిజిస్ట్రేషన్లపై ఉన్న నిషేధ గడువు గురువారంతో ముగిసింది. ఇకపై ఆ గడువును పొడిగించడం లేదని, త్వరలో ఆ భూములకు లైన్‌ క్లియర్‌ అవుతుందని అధికారులు స్పష్టం చేసారు. కలెక్టర్ల సమావేశంలో ఫ్రీహోల్డ్‌ భూముల గురించి ప్రస్తావన రాగా..త్వరలో ఫ్రీహోల్డ్‌ను క్లియర్‌ చేస్తామని మంత్రి అనగాని పేర్కొన్నారు. అయితే.. ఫ్రీహోల్డ్‌ రిజిస్ట్రేషన్ల విధివిధానాలు, ఇతర అంశాల కూర్పు ఇంకా పూర్తికాలేదని, ఉత్తర్వులు విడుదల చేయడానికి మరో రెండు, మూడు రోజుల సమయం పట్టనుందని సమాచారం.

 పవన్ ఫిక్స్: చంద్రబాబుతో కీలక భేటీ - అక్కడే ఫైనల్..!!
పవన్ ఫిక్స్: చంద్రబాబుతో కీలక భేటీ - అక్కడే ఫైనల్..!!
ap-govt-set-to-end-two-year-wait-allow-registration-of-freehold-lands-here-the-guide-lines

ఏపీ ప్రభుత్వం తుది కసరత్తు

అయితే, ఈ భూముల పైన ఏర్పాటు చేసిన ఉపసంఘం నివేదిక ప్రకారం.. అసైన్డ్‌ చట్టం నిబంధనలకు లోబడి ఫ్రీ హోల్డ్‌ అయిన భూములకు స్వేచ్ఛ కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంటే.. నిబంధనల ప్రకారం ఫ్రీహోల్డ్‌ అయిన 7.9 లక్షల ఎకరాలకు ఇప్పుడు విముక్తి లభించబోతోంది. వీటికి తోడు అసైన్డ్‌ చట్టం ప్రకారం గత రెండేళ్ల వ్యవధిలో 20 ఏళ్ల గడువు తీరిన భూములు మరో 60 వేల ఎకరాల మేర ఉండొచ్చని అధికారవర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇవన్నీ కలిపి 8.50 లక్షల ఎకరాలను ఫ్రీహోల్డ్‌ జాబితాలోకి తీసుకొచ్చి రిజిస్ట్రేషన్లకు అవకాశం కల్పించేలా రెవెన్యూ శాఖ ఉత్తర్వులు ఇవ్వనుంది. ఫ్రీహోల్డ్‌ విధానం ఎలా ఉండాలి? ఏయే భూములకు అది వర్తిస్తుంది? అన్న అంశాలపై స్పష్టత ఇస్తూ రెవెన్యూ శాఖ ఉత్తర్వులు ఇవ్వనుంది. ఫ్రీహోల్డ్‌ రిజిస్ట్రేషన్లకు అవకాశం కల్పిస్తూ త్వరలో ఉత్తర్వులు ఇచ్చే విధంగా తుది కసరత్తు కొనసాగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+