Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..!

ఏపీలో ఉద్యోగులకు మెడికల్ బిల్లుల రీయింబర్స్ మెంట్ విషయంలో ప్రభుత్వం (ap govt) కీలక మార్పు చేసింది. రాష్ట్రంలో ఉద్యోగులకు అందిస్తున్న క్యాష్ లెస్ వైద్య సదుపాయం అందని సందర్భాల్లో ముందుగా ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని, ఆ తర్వాత ప్రభుత్వానికి మెడికల్ బిల్లులు రీయింబర్స్ మెంట్ కోసం పెట్టుకుంటారు. వీటి చెల్లింపు విషయంలో ప్రభుత్వం ఇప్పుడు కీలక మార్పు చేసింది.

ఉద్యోగుల మెడికల్ బిల్లుల రీయింబర్స్ మెంట్ (ap govt)

ఉద్యోగుల వైద్య బిల్లుల మెడికల్ రీ-ఎంబర్స్ మెంట్‌ విధానంలో కూటమి ప్రభుత్వం నూతన సంస్కరణలు తెస్తోంది. ముఖ్యంగా ఉద్యోగులకు ప్రయోజనకరంగా ఉండేందుకు, వారికి వ్యయప్రయాసలు లేకుండా చేసేందుకు వీలుగా పేపర్ లెస్ విధానంలో ఆన్‌లైన్‌ ద్వారా మాత్రమే బిల్లుల స్వీకరణ, పరిశీలన, బిల్లుల మంజూరు, చెల్లింపులు జరిగేలా వైద్య ఆరోగ్య శాఖ చర్యలు తీసుకుంటోంది. ఈ మేరకు నూతన సాఫ్ట్‌వేర్ ఏపీ సెంటర్ ఫర్ పైనాన్షియల్ సిస్టమ్స్ అండ్ సర్వీసెస్ (ఏపీసీఎఫ్ఎస్ఎస్) ద్వారా తయారు చేయిస్తోంది.

AP Govt Shifts Medical Reimbursement to Digital-Only Payments for Employees

ప్రభుత్వం కసరత్తు

కొత్త సంస్కరణలను త్వరగా అమల్లోకి తెచ్చేందుకు వైద్య ఆరోగ్య శాఖ కృషి చేస్తోంది. హాస్పటల్ రిజిస్ట్రేషన్, ఇతర చర్యలను ఏప్రిల్ 30 నాటికి పూర్తి చేయాలని ప్రాథమికంగా లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు 5,55,988 మంది, పెన్షనర్లు 2,32,764 మంది ఉన్నారు. వీరిపై ఆధారపడిన కుటుంబ సభ్యులతో కలిపి మొత్తం 24,33,306 మంది 'ఉద్యోగుల ఆరోగ్య బీమా' (ఈహెచ్ఎస్) పరిధిలో ఉన్నారు. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా ట్ర‌స్ట్ అనుబంధ ఆసుపత్రుల్లో నగదురహిత విధానంలో చికిత్స పొందిన వారు కాకుండా. మెడికల్ రీ-ఎంబర్స్ మెంట్ విధానం (సొంత ఖర్చు) లో చికిత్స పొందిన వారి బిల్లులు ట్ర‌స్ట్ కార్యాలయానికి అందుతున్నాయి. 2024-25 ఆర్ధిక సంవత్సరంలో రూ.232 కోట్ల విలువైన బిల్లులను మంజూరు చేశారు. ఈహెచ్ఎస్ ద్వారా నగదు రహిత విధానంలో ఎన్టీఆర్ వైద్యా సేవల‌ ట్రస్ట్‌ అనుబంధ ఆసుపత్రుల్లో చికిత్స పొందేందుకు వీలుంది. ఇవి కాకుండా డైరెక్టరేట్‌ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) అదనంగా గుర్తించిన మరో 600 ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో సొంత డబ్బుతో చికిత్స పొందిన వారు వాటిని తిరిగి పొందేoదుకు మెడికల్ రీఎంబర్స్ మెంట్‌ విధానంలో బిల్లుల వారి 'డీడీఓ ల‌ద్వారా ప్రభుత్వానికి పంపుతున్నారు.

ప్రస్తుత విధానం

చికిత్స పొందిన తర్వాత ఉద్యోగులు ఆసుపత్రుల నుంచి ఆరోగ్య వివరాలు, పొందిన చికిత్స, రిపోర్టులు, బిల్లులను సదరు శాఖల 'డీడీఓ'లకు సమర్పిస్తున్నారు. అక్కడి నుంచి ట్రస్ట్‌ కార్యాలయానికి బిల్లులు వెళ్తున్నాయి. ఇక్కడి వైద్యుల పరిశీలన పూర్తయిన అనంతరం మంజూరు చేసిన బిల్లులను మళ్ళీ సంబంధిత 'డీడీఓ'లకు పంపుతున్నారు. డీడీఓ మళ్లీ హెచ్ ఓడి కార్యాలయానికి పరిపాలనాపరమైన ఆమోదం కోసం పంపుతున్నారు. వివ‌రాల‌ పరిశీలన అనంతరం హెచ్ ఓడి పంపిన పరిపాలనా ఆమోద ఉత్తర్వుల మేరకు డీడీఓ సదరు వివరాలను బిల్లుల చెల్లింపు కోసం సీఎఫ్ఎంఎస్ పోర్టల్ లో అప్లోడ్ చేస్తున్నారు. దీనికి అనుగుణంగా చెల్లింపులు జరుగుతున్నాయి. డీడీఓ నుంచి ట్రస్ట్‌ వరకు ఆన్లైన్లో వివరాలు పంపుతున్నా, ఆ తరువాత ప్రాసెస్ మాత్రం ఆఫ్‌లైన్‌లో జరుగుతున్నందువల్ల బిల్లుల చెల్లింపుల విష‌యంలో ఎక్కువ సమయం పడుతోంది. ముఖ్యంగా పెన్షనర్లు మెడికల్ రీఎంబర్స్‌మెంట్‌ విధానం పూర్తిగా ఆఫ్‌లైన్‌లో జరుగుతోంది. దీనివల్ల ఉద్యోగులు, పెన్షనర్లు ఇబ్బందులు పడుతున్నారు.

AP Govt Shifts Medical Reimbursement to Digital-Only Payments for Employees

ఇకపై చెల్లింపుల ప్రక్రియ ఇలా..

ఎన్టీఆర్ వైద్యా సేవ ట్రస్ట్‌ సీఈఓ ఈ నెల 18న మెడికల్ రీ-ఎంబర్స్ మెంట్ విధానంలో సంస్కరణలు తీసుకువస్తున్నందున ప్రత్యేక ఆన్‌లైన్‌ విధానాన్ని రూపొందించాల‌ని సిఏఫ్ఏస్ఎస్ కు వర్క్ ఆర్డర్ పంపారు.రాబోతున్న సంస్కరణలు, చికిత్స పొందిన ఆసుపత్రుల నుంచి సదరు ఉద్యోగుల ఆరోగ్య, చికిత్స బిల్లుల వివరాలు నేరుగా ట్ర‌స్ట్ కార్యాలయానికి వెళ్తాయి. ఇక్కడ వైద్యుల పరిశీలన అనంతరం బిల్లులు మంజూరు వివరాలు సదరు ఉద్యోగి హెచ్ఓడి కార్యాలయానికి పరిపాలనా ఆమోదం కోసం వెళ్తాయి. అనుమతి ఉత్తర్వులు ఇక్కడి నుంచి డీడీఓ కార్యాలయానికి వెళ్తాయి. డీడీఓ కార్యాలయానికి వివరాలు అందిన వెంటనే బిల్లులను చెల్లింపుల కోసం ఆన్‌లైన్‌లో అప్లోడ్ చేస్తారు. పైన పేర్కొన్న ప్రతి ప్రక్రియ కాగిత రహిత విధానంలో ఆన్‌లైన్‌లోనే జరుగుతుంది. దీనివల్ల ఉద్యోగులు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. సమయం ఆదా అవుతుంది. జిల్లా స్థాయిలో రూ.50,000 లోపు జరిగే అసుపత్రుల బిల్లుల చెల్లింపు ప్రస్తుతం మ్యానువల్ విధానంలో జరుగుతోంది. దీనిని కూడా పూర్తిగా ఆన్‌లైన్‌ పరిధిలోనికి తీసుకొస్తారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+