విద్యార్ధి మిత్ర కిట్లు సిద్దం, ఈ సారి కొత్తగా - పంపిణీ ఇలా..!!
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. జగన్ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన పథకా లకు పేర్లు మార్పు చేసి కొనసాగిస్తోంది. విద్యార్ధులకు వైసీపీ ప్రభుత్వంలో జగనన్న విద్యా కానుక పేరుతో యూనిఫాం.. పుస్తకాలు.. ఇతర సామాగ్రి అందించేంది. 2024లో ప్రభుత్వం మారిన వీటిని మార్పు చేయాలని నిర్ణయించారు. ఈ ఏడాది నుంచి అమలు చేస్తున్నారు. కిట్స్ పేరు మార్పుతో పాటుగా కొత్తగా పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నారు.
కూటమి ప్రభుత్వం గతంలో అమలైన జగనన్న విద్యా కానుక స్కీంను సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర పేరిట కిట్లు అందించాలని నిర్ణయించింది. ఈ పథకాన్ని వేసవి సెలవుల తరువాత పాఠశాలలు తిరిగి ప్రారంభమయ్యే రోజు జూన్ 12న పంపిణీ చేయాలని డిసైడ్ అయింది. ఇందు కోసం కమిటీలను ఏర్పాటు చేసింది. మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పర్యవేక్షణా బాధ్యతలను ఖరారు చేసింది. ఇక, ఈ కిట్లలో విద్యార్థి మిత్ర కిట్‌లో పాఠ్య, రాత పుస్తకాలు, వర్క్ బుక్స్, నిఘంటువులు, యూనిఫాం దుస్తులు, బ్యాగులు, బూట్లు, బెల్టులు ఉంటాయి. అదే విధంగా పాఠశాలల నిర్వహణలోనూ మార్పులు చేసారు.

ఈ కిట్స్ పంపిణీ కోసం ఏర్పాటు చేసిన కమిటీలకు మండల స్థాయిలో కమిటీకి ఎంఈఓ-2 అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు. ఎంఈఓ-1, మండల ఇంజినీరు, ఎంఐఎస్ సమన్వయకర్త / డేటా ఎంట్రీ ఆపరేటర్, సీఎంఆర్‌టీతో సహా మరో ముగ్గురు సభ్యులుగా ఉంటారు. కిట్లను మండల స్టాక్ పాయింట్‌కు చేర్చడం, సరిచూసి రసీదులు అందజేయడం, యాప్‌లో అప్‌లోడ్ చేయడం, పాఠశాలకు చేర్చడం, పర్యవేక్షణ, రోజువారీ నివేదికలు, రికార్డుల నిర్వహణ బాధ్యతలు వీరు చూడాల్సి ఉంటుంది. పాఠశాల స్థాయిలో కమిటీకి ప్రధానోపాధ్యాయుడు, గ్రామ విద్యా సహాయకుడు, మహిళా పోలీస్, పేరెంట్ కమిటీ నుంచి ఇద్దరు ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు. వీరు విద్యార్థులకు కిట్లు పంపిణీ చేస్తారు.












Click it and Unblock the Notifications