17న ఏపీ బడ్జెట్ - విశాఖ నుంచి పాలన పై కీలక నిర్ణయం..!?
అసెంబ్లీ సమావేశాల వేదికగా ఏపీ ప్రభుత్వం విశాఖపై కీలక ప్రకటనకు సిద్దం అవుతోంది.
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 14న ప్రారంభం కానున్నాయి. గవర్నర్ అబ్దల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఏపీ గవర్నర్ గా బాధ్యతుల స్వీకరించిన తరువాత జరుగుతున్న తొలి సమావేశం. గవర్నర్ ప్రసంగం తరువాత అసెంబ్లీ బీఏసీ సమావేశం కానుంది. అందులో సమావేశాల నిర్వహణ..అజెండా పైన నిర్ణయం తీసుకోనున్నారు. ఈ సమావేశాల్లో ఏపీ ప్రభుత్వం 2023-24 వార్షిక బడ్జెట్ రూ 2.56 లక్షల కోట్లతో ప్రవేశ పెట్టారు. ఈ సారి ఆ కేటాయింపులు మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఈ సమావేశాల్లోనే విశాఖ నుంచి పాలన పైనా ప్రభుత్వం స్పష్టత ఇవ్వనుందని తెలుస్తోంది.

14వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు
ఏపీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 14వ తేదీ నుంచి 11 పని దినాలు నిర్వహించాలని భావిస్తున్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నెల 29వ తేదీ వరకు సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది. మార్చి 28, 29 తేదీల్లో విశాఖలో జీ20 సన్నాహక సదస్సు జరగనుంది. ఈ సదస్సుకు ముందే సమావేశాలు ముగించాలని తొలుత ప్రభుత్వం భావించింది. ఈ సమావేశాలను ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోంది. అయితే, ఎన్నికల ఏడాది ప్రవేశ పెడుతున్న పూర్తి స్థాయి బడ్జెట్ కావటంతో..అన్ని రంగాల పైన చర్చ..ప్రభుత్వం సమాధానం ఇవ్వాలని భావిస్తోంది. దీని కోసం సమావేశాలను ఈ నెల 30వ తేదీ వరకు నిర్వహించే ఆలోచనలో ఉంది. దీనికి సంబంధించి బిజినెస్ సలహా మండలి సమావేశంలో అధికారికంగా నిర్ణయం తీసుకోనున్నారు.

17న అసెంబ్లీలో వార్షిక బడ్జెట్
ఈ నెల 17న ఆర్దిక మంత్రి బుగ్గన అసెంబ్లీలో 2023-24 వార్షిక బడ్జెట్ ను ప్రవేశ పెట్టనున్నారు. దీనికి సంబంధించి ముహూర్తం ఖరారైంది. 18, 19 సెలవులు ప్రకటించనుంది. 25, 26 తేదీల్లో శని, ఆదివారాలు కాగా, 22న ఉగాది సందర్భంగా సెలవు రానుంది. 30న శ్రీరామ నవమి. దీంతో..29వ తేదీతో సమావేశాలు ముగించే అవకాశం ఉంది. వచ్చే ఏడాది ఎన్నికలు జరగనుండటంత ప్రభుత్వానికి ఈ ఏడాది బడ్జెట్ కీలకంగా మారుతోంది. గత ఏడాది బడ్జెట్ లో మొత్తం 2 లక్షల 56 వేల 256 కోట్ల రూపాయలతో అంచనాలను సభ ముందు ఉంచారు. ఈ సారి సంక్షేమంతో పాటుగా ప్రాధాన్యత రంగాలకు కేటాయింపులు పెంచే అవకాశం కనిపిస్తోంది. సంక్షేమానికి మరింతగా నిధులు కేటాయించాల్సి న అవసరం ఉంది.













Click it and Unblock the Notifications