రేపు వారి ఖాతాల్లో నగదు జమ చేయనున్న ప్రభుత్వం..!!
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వరదల కారణంగా నష్టపోయిన వారికి ప్రభుత్వం ఇప్పటికే పరిహార ప్యాకేజీ ప్రకటించింది. నీట మునిగిన ప్రతీ ఇంటికి సాయం అందించాలని నిర్ణయించింది. ఇప్పటికే కొంత మందికి సాయం అందగా.. మరి కొంత మందికి అందలేదు. దీంతో, వారికి రేపు (సోమవారం) ప్రభుత్వం బ్యాంకుల్లో సాయం ప్రకటించిన నగదు జమ చేయనున్నట్లు వెల్లడించింది.
సాయం అందని బాధితులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. భారీగా నష్టపోయామని తమకు అండగా నిలవాలని కోరుతున్నారు. ప్రభుత్వం ప్రకటించిన పరిహారం అందటం లేదని వాపోతున్నారు. దీంతో, వారికి కలెక్టర్ హామీ ఇచ్చారు. వరద ప్రభావిత ప్రాంతాల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అందించే పరిహారానికి సంబంధించి బ్యాంకు ఖాతాల్లో సమస్యల వల్ల పెండింగ్ పడిందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజన తెలిపారు. పెండింగ్‌లో ఉన్న 18 వేల కుటుంబాలకు గాను 4 వేల కుటుంబాలు ఇప్పటికే ఖాతాలను సరిచేసుకోవడం వల్ల పరిహారం అందిందన్నారు.

మిగిలిన 14 వేల కుటుంబాలకు సంబంధించి ఖాతాలను సచివాలయ కార్యదర్శుల ద్వారా ప్రభుత్వమే పరిష్కరించిందని, వీరికి రెండు రోజుల్లో పరిహారం అందుతుందని వెల్లడించారు. పలు కారణాలవల్ల పరిహారం అందజేయడంలో ఇబ్బంది ఎదురైనట్లు గుర్తించామన్నారు. వాటిని సచివాలయాల కార్యదర్శులు ఆయా కుటుంబాలను సంప్రదించి సరిచేశారని తెలిపారు. పరిహారం కోసం కలెక్టరేట్లో సమర్పించిన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించడం జరుగుతోందని, అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేయడం జరుగుతుందని, ఆందోళన చెందాల్సిన పని లేదని స్పష్టం చేశారు.
-
పోలవరం ప్రాజెక్ట్ పై కేంద్రానికి మంత్రి విన్నపాలు! -
ఏపీ సీఎం చంద్రబాబుతో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ భేటీ..! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!!











Click it and Unblock the Notifications