Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఏపీ విద్యార్ధులకు సర్కార్ గుడ్ న్యూస్..! దేశంలో తొలిసారి..!

ఏపీలో విద్యార్ధులకు ప్రభుత్వం (ap govt)ఇవాళ మరో శుభవార్త చెప్పింది. కౌమార దశలో ఉన్న విద్యార్థుల కోసం ప్రత్యేక డిజిటల్ హెల్త్ పోర్టల్ ను ప్రారంభించింది . ఆరోగ్య సంరక్షణ, శారీరక మార్పులు, మానసిక వికాసం, హెచ్ఐవీ వంటి అంశాలపై ఈ పోర్టల్ లో సమాచారం పొందుపరిచింది. ఇందులోనే ఈ-లెర్నింగ్ ద్వారా నేర్చుకోవడానికి వీలుగా పలు అంశాల్ని అందుబాటులో ఉంచారు. ఏపీఎస్ హెచ్ డబ్ల్యూపీ' పేరుతో పోర్టల్ (apshwp.ap.gov.in) రూపొందించినట్లు వైద్యమంత్రి వెల్లడించారు.

Amaravati: పీఎంవో అత్యవసర ఆదేశాలు-28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేక భేటీ..!
Amaravati: పీఎంవో అత్యవసర ఆదేశాలు-28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేక భేటీ..!

దేశంలోనే తొలిసారిగా 13-19 ఏళ్ల మధ్య ఉన్న కౌమార విద్యార్థుల కోసం ప్రత్యేకంగా 'ఆంధ్రప్రదేశ్ స్కూలు హెల్వెల్నెస్ ప్రోగ్రాం' కింద డిజిటల్ పోర్టల్ ను తయారుచేశారు. వైద్య సేవల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్న ప్రభుత్వం తాజాగా ప్రివెన్షన్ విధానంలో విద్యార్థులకు ఆరోగ్య సంరక్షణ ప్రాధాన్యం, వ్యసనాల దుష్ప్రభావాలు మానసిక ఉల్లాసం, మంచి పద్ధతులు తెలుసుకునేలా అత్యాధునిక సాంకేతి పరిజ్ఞానంతో ఈ వెబ్ సైట్ రూపొందించింది.

AP Govt Unveils Digital Health Portal to Boost Student Wellness and E-Learning
Budget 2026: బడ్జెట్ లో స్కూళ్లకు బంపర్ న్యూస్..! పిల్లలకు పండగే...!
Budget 2026: బడ్జెట్ లో స్కూళ్లకు బంపర్ న్యూస్..! పిల్లలకు పండగే...!

ఇందులో వ్యక్తిగత పరిశుభ్రత, ఆరోగ్య సంరక్షణ, మత్తు పదార్ధాల వినియోగానికి దూరంగా ఉండడం, లింగ సమానత్వం, హెచ్ఐవీ, రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా ఉండటం, ఇంటర్నెట్, సామాజిక మాధ్యమాల సురక్షిత వినియోగం వంటి అంశాలపై సెల్ఫ్ లెర్నింగ్ లో నేర్చుకునేలా 'ఏపీఎస్ హెచ్ డబ్ల్యూపీ' కొత్త పోర్టల్ ను అందుబాటులోనికి తెచ్చినట్లు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. రాష్ట్ర కిశోర ఆరోగ్య కార్యక్రమం* కింద 'డిజిటల్ లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్' కింద రూపొందించిన ఈ పోర్టల్ ప్రాధాన్యం గురించి విద్యార్థులకు వివరించేలా స్కూల్స్, కాలేజీల్లో ఉపాధ్యాయులు, లెక్చరర్లలో ఎంపిక చేసిన వారికి శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.

AP Govt Unveils Digital Health Portal to Boost Student Wellness and E-Learning
ఏపీ గురుకుల పాఠశాలలు, కాలేజీల్లో అడ్మిషన్లపై కీలక అప్డేట్..!
ఏపీ గురుకుల పాఠశాలలు, కాలేజీల్లో అడ్మిషన్లపై కీలక అప్డేట్..!

ఈ వెబ్ సైట్ లలో విద్యార్థులందరికీ ఉపయోగపడేలా 11 ప్రధాన అంశాల సమాచారం ఉంది. ఆరోగ్య సంరక్షణ ప్రాధాన్యం, మానసిక ఆరోగ్యం, వ్యక్తిగత సంబంధాలు ఎలా ఉండాలి? నైతిక విలువలు-ప్రాధాన్యం, పౌష్టికాహారం ప్రాముఖ్యత, వ్యక్తిగత పరిశుభ్రత, ఇతర అంశాల గురించి 15 నిమిషాలలోపు ఉండేలా వీడియోలను తెలుగు, ఆంగ్ల భాషల్లో ఉంచారు. విద్యార్థులు పరస్పరం మాట్లాడుకుంటే ఎలా ఉంటుందో అలా వివిధ అంశాలపై వీడియో పాఠాలను రూపొందించారు. ఉదాహరణకు బాలికల రుతుక్రమం, వ్యక్తిగత పరిశుభ్రత, మత్తు పదార్థాల వాడకంతో వచ్చే ఆరోగ్య క్షీణత గురించి వీడియో పాఠాల్లో పేర్కొన్నారు. అలాగే మితిమీరిపోతున్న సోషల్ మీడియా ప్రభావంవల్ల ఎటువంటి కష్టాలు, నష్టాలు ఎదురవుతాయో తెలిపే విధంగా వీడియో పారాలు పోర్టలులో ఉన్నాయి. ఆటల రూపంలో ఈ-లెర్నింగ్, క్విజ్ పోటీల్లో పాల్గొనడం, ఆన్లైన్ పరీక్షలు రాసిన వారికి వైద్య ఆరోగ్య శాఖ ద్వారా సర్టిఫికెట్లు కూడా ఇస్తారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+