ఏపీలో రేపు తీవ్ర వడగాల్పులు-ఈ జిల్లాలకు అలర్ట్..!

ఏపీలో వేసవి తాపం అంతకంతకూ పెరుగుతోంది. ముఖ్యంగా కోస్తా జిల్లాలో ఉష్ణోగ్రతలు పెరుగుతూ పోతున్నాయి. పలు జిల్లాల్లో వడగాల్పుల ప్రభావం కూడా కనిపిస్తోంది. ఇదే క్రమంలో రాష్ట్ర విపత్తుల నిర్వహణ విభాగం తాజాగా ఓ అలర్ట్ జారీ చేసింది. రేపు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వడగాల్పుల (Heat Wave) తీవ్రత ఉంటుందని అందులో హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, వేసవితాపం ప్రభావం పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతోంది.

ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) రేపు శుక్రవారం (27-03-2026) రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తీవ్రమైన వడగాల్పులు వీచే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది. పలు జిల్లాల్లో వడగాల్పుల తీవ్రత ఉంటుందని తెలిపింది. ఇందులోనూ ఏయే మండలాల్లో ఈ ప్రభావం ఉంటుందో కూడా వివరాలను వెల్లడించింది. ఇందులో పార్వతీపురం మన్యం జిల్లాలోని గుమ్మలక్ష్మీపురం, కురుపాం, అలాగే అల్లూరి సీతారామరాజు జిల్లాలోని చింతూరు, కూనవరం, వరరామచంద్రాపురం, కాకినాడ జిల్లాలోని జగ్గంపేట, తూర్పుగోదావరి జిల్లాలోని కోరుకొండ, ఎన్టీఆర్ జిల్లాలోని జి.కొండూరు, ఇబ్రహీంపట్నంలోనూ వడగాల్పుల తీవ్రత ఉంటుందని తెలిపింది.

Heat Wave Alert Issued AP Disaster Management Names Districts at Risk Tomorrow

ఇలా రేపు వడగాల్పులు వీచే 32,శనివారం వడగాల్పులు వీచే 90 మండలాలు, ఉష్ణోగ్రతల పూర్తి వివరాలతో ఓ లింక్ ను కూడా రిలీజ్ చేసింది. అలాగే ఆయా ప్రాంతాల్లోని ప్రజలు చెవుల్లోకి వేడి గాలి వెళ్లకుండా జాగ్రత్త పడాలని సూచిస్తోంది. వృద్ధులు, గర్భిణీలు, బాలింతలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని తెలిపింది. మంచి నీరు, మజ్జిగ, ORS ఎక్కువగా తాగాలని సూచిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+