వర్షం, వడగాల్పుల సమాచారం మరింత కచ్చితంగా- మిషన్ మౌసమ్ ప్రారంభించిన మోడీ..!
భారత్ వంటి జనసమ్మర్ధం ఎక్కువగా ఉండే దేశాల్లో విపత్తులు జరిగితే దాని ప్రభావం కూడా అంతే స్ధాయిలో ఉంటుంది. దీంతో వాతావరణం, విపత్తుల్ని ఎంత ముందుగా గుర్తిస్తే అంత నష్టాన్ని తగ్గించే అవకాశం ఉంటుంది. దీని కోసం నిరంతరం పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. ఇదే క్రమంలో రూపుదిద్దుకున్న మిషన్ మౌసమ్ ప్రాజెక్టును ప్రధాని మోడీ ఇవాళ ప్రారంభించారు. ఇది భారత వాతావరణ శాఖ (ఐఎండీ) పనితీరును మరింత మెరుగుపర్చబోతోంది.
భారత వాతావరణ శాఖ ఏర్పాటు చేసి 150 ఏళ్లు పూర్తయ్యాయి. 1875లో ప్రారంభించిన వాతావరణ శాఖ ఇప్పటివరకూ మనకు వర్షాల రాకను, రుతుపవనాల గమనాన్ని, విపత్తులను అంచనా వేస్తోంది. దీని వల్ల ఎక్కువగా నష్టం జరగకుండా చూడగలుగుతోంది. అయితే దీని కచ్చితత్వాన్ని మరింత మెరుగుపర్చేందుకు పలు శాటిలైట్స్ ను ఇప్పటికే నింగిలోకి ప్రయోగించాం. ఇప్పుడు మిషన్ మౌసమ్ పేరుతో రూపొందించిన కొత్త ప్రాజెక్టు ఈ అంచనాల్ని మరింత కచ్చితంగా మార్చబోతోంది.

భారతదేశాన్ని వాతావరణ అనుకూలంగా మార్చేందుకు, వాతావరణాన్ని స్మార్ట్‌గా మార్చడానికి మిషన్ మౌసమ్‌ని ప్రారంభిస్తున్నట్లు ప్రధాని మోడీ తెలిపారు. వాతావరణ శాస్త్రం ఏ దేశం యొక్క విపత్తు నిర్వహణ సామర్థ్యానికి అయినా అత్యంత కీలకమని, ప్రకృతి వైపరీత్యాల ప్రభావాన్ని తగ్గించడానికి, వాతావరణ శాస్త్రం యొక్క సామర్థ్యాన్ని మనం గరిష్టంగా పెంచుకోవాలని మోడీ పిలుపునిచ్చారు. వాతావరణ అంచనా, భారత వాతావరణ విభాగం సామర్థ్యాలను అప్‌గ్రేడ్ చేయడం ఈ మిషన్ లక్ష్యం. మిషన్ మౌసమ్ అమలులోకి వచ్చిన మొదటి రెండేళ్లకు 2 వేల కోట్ల బడ్జెట్ కేటాయించారు.
Prime Minister @narendramodi addressed the 150th Foundation Day celebrations of India Meteorological Department.
— Ministry of Information and Broadcasting (@MIB_India) January 14, 2025
PM Narendra Modi launched ‘Mission Mausam’ and released IMD's Vision-2047 document.
Prime Minister also unveiled a commemorative postage stamp and coin on the… pic.twitter.com/rzSkxZvbiV
వ్యవసాయం, విమానయానం, రక్షణ, విపత్తు నిర్వహణ, పర్యాటకం, ఆరోగ్యం వంటి కీలక రంగాలకు ఈ మిషన్ వల్ల నేరుగా ప్రయోజనం చేకూరుతుంది. అలాగే అంచనాలను మెరుగుపరచడంలో ఇది ప్రయోజనకరమని కేంద్రం చెబుతోంది. మిషన్ మౌసమ్ దేశంలో అందించే వాతావరణ, అంచనా సేవలకు సంబంధించిన అన్ని అంశాలను కవర్ చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. 2012లో మిషన్ మాన్‌సూన్ ప్రారంభంతో రుతుపవనాల అంచనాకు ఈ ప్రోత్సాహం లభించింది. ప్రస్తుతం 24 గంటల ముందుగానే వడగాల్పుల వంటి విపత్తుల్ని ఐఎండీ దాదాపు 97.99 శాతం ఖచ్చితంగా అంచనా వేస్తోంది. అయితే భారీ వర్షపాతం అంచనాల ఖచ్చితత్వం మాత్రం 80 శాతం మాత్రమే ఉంది. వీటిని ఈ ప్రాజెక్టు మరింత మెరుగుపర్చనుంది.
-
బంగాళాఖాతంపై మరింత విస్తరించిన ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
"అప్పుడు వేరు.. ఇప్పుడు వేరు": భారత్ స్థానం మారింది - ప్రధాని మోడీ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !!












Click it and Unblock the Notifications