Ramayana: 100 కోట్ల వ్యూస్ తో 'రామాయణ' సంచలన రికార్డ్..
భారతీయ చలన చరిత్రలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చిత్రం 'రామాయణ'.. ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ శ్రీ రాముడిగా కనిపించనున్నారు. అలాగే టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సాయి పల్లవి సీతమ్మగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి నితీశ్ తివారీ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ మూవీ ట్రైలర్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. యూట్యూబ్ లో డిజిటల్ ప్లాట్ ఫామ్స్ కలిపి ఈ ట్రైలర్ కు 1 బిలియన్ అంటే 100 కోట్ల వ్యూస్ వచ్చాయి. ఇక భారతీయ సినీ చరిత్రలో 100 కోట్ల మైలురాయి అందుకున్న తొలి ట్రైలర్ గా రామాయణ కొత్త రికార్డు నెలకొల్పింది.
ఈ మూవీ ట్రైలర్ జూలై 30న బ్రాహ్మి ముహూర్తంలో విడుదలైన సంగతి తెలిసిందే. ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ అయిన నాలుగు రోజుల్లోనే రామాయణ ట్రైలర్ ఏకంగా 800 మిలియన్ వ్యూస్ ను సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా ఈ మూవీ ట్రైలర్ 100 కోట్ల వ్యూస్ ను రాబట్టింది. ఇక రాకింగ్ స్టార్ యశ్ ఈ మూవీలో రావణుడి పాత్రలో నటించారు. ఈ మూవీ రెండు భాగాలుగా తెరకెక్కుతోంది. తొలి భాగం ఈ ఏడాది దీపావళి సందర్భంగా నవంబర్ 6 న రిలీజ్ కానుంది. రెండో భాగం వచ్చే ఏడాది దీపావళి పండగ సందర్భంగా రిలీజ్ కానుంది.

ఇక ఈ మూవీపై చిత్ర నిర్మాత నమిత్ మల్హోత్రా తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. రామాయణ ట్రైలర్ రిలీజైన కేవలం ఐదు రోజుల్లోనే వంద కోట్ల వ్యూస్ రాబట్టడం భారత్ కు ఎంతో గర్వకారణమైన విషయం.. అని అన్నారు. రామాయణ చిత్రాన్ని ప్రపంచస్థాయి ప్రేక్షకులకు చేరువచేయడమే తమ లక్ష్యం అని స్పష్టం చేశారు. ఈ మేరకు తాము సోనీ పిక్చర్స్ తో అసోసియేట్ అయ్యామని.. సోనీ పిక్చర్స్ ప్రపంచవ్యాప్తంగా రామాయణ చిత్రాన్ని భారీగా విడుదల చేస్తుందని ఆశిస్తున్నామని పేర్కొన్నారు. కాబట్టి తమపై నమ్మకం ఉంచండి అని ఈ మూవీ మిమ్మల్ని ఏమాత్రం నిరాశపర్చమని నిర్మాత నమిత్ మల్హోత్రా రామాయణ సినిమాపై స్పష్టం చేశారు.



Click it and Unblock the Notifications