విద్యార్థులకు పండగే: స్కూళ్లకు వరుసగా 3 రోజులు హాలిడేస్!
తెలుగు రాష్ట్రాల విద్యార్థులు, ఉపాధ్యాయులకే కాకుండా ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు గుడ్ న్యూస్ అందింది. ఈ వీకెండ్లో స్కూల్స్, కాలేజీలతో పాటు ప్రభుత్వ, ప్రైవేట్ ఆఫీసులకు వరుసగా సెలవులు రానున్నాయి. ఏపీలో వరుసగా రెండు రోజులు, తెలంగాణలో వరుసగా 3 రోజుల పాటు విద్యాసంస్థలు మూతపడనున్నాయి. చదువులు, హోంవర్క్, పరీక్షలతో సతమతమవుతున్న విద్యార్థులకు కాస్త రిలీఫ్ లభించనుంది. స్టూడెంట్స్ కుటుంబ సభ్యులతో సరదాగా సమయం గడిపేందుకు ఈ లాంగ్ వీకెండ్ ఎంతో ఉపయోగపడనుంది.
బోనాల పండగ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం సోమవారం సాధారణ సెలవు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రేపు 2వ శనివారం, ఆదివారంతో కలుపుకొని వరుసగా 3 రోజుల పాటు స్కూళ్లకు సెలవులు రానున్నాయి. తెలంగాణలో అత్యంత వైభవంగా జరుపుకునే బోనాల పండుగ ముగింపు వేడుకలు ఆగస్టు 10న హైదరాబాద్ లో నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా రంగం, పోతురాజుల విన్యాసాలు, ఘటం ఊరేగింపు వంటి సంప్రదాయ కార్యక్రమాలు ఘనంగా జరగనున్నాయి. ఇటీవల వర్షాల సమయంలో సెలవు ఇచ్చిన స్కూళ్లు మాత్రం రేపు తెరుచుకోనున్నాయి. అటు SIR విధుల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు 10వ తేదీలోపు డేటా సమర్పించాల్సి ఉన్నందున వారు విధుల్లో కొనసాగాల్సి ఉంటుందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. రెండో శనివారంతో పాటు సోమవారం రోజున ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించడంతో వరుసగా 3 రోజుల పాటు స్కూళ్లు, కాలేజీలు మూసివేయనున్నారు.

ఆగస్టులో వచ్చే ప్రభుత్వ సెలవులు
3 రోజుల లాంగ్ వీకెండ్ రావడంతో చాలా కుటుంబాలు తమ స్వగ్రామాలకు వెళ్లేందుకు, సెలవులను సద్వినియోగం చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. మరికొందరు టూరిస్ట్ ప్రాంతాలను సందర్శించేందుకు రెడీ అవుతున్నారు. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలోని విద్యా సంస్థలకు ఈ ఆగస్టు నెలలో మొత్తం 11 రోజుల సెలవులు రానున్నాయి.ఇందులో 5 ఆదివారాలు, 3 సాధారణ ప్రభుత్వ సెలవులు, 3 ఆప్షనల్ హాలిడేస్ ఉన్నాయి. ఆగస్టులో వచ్చే ప్రభుత్వ సెలవులు 3 ఉన్నాయి. ఆగస్టు 10న బోనాల పండుగ, ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం, ఆగస్టు 26న మిలాద్-ఉన్-నబీ వేడుకల సందర్భంగా ప్రభుత్వ సెలవులు రానున్నాయి. ఈ మూడు తేదీలను తెలంగాణ సర్కారు సాధారణ సెలవులుగా నోటిఫై చేసింది.




Click it and Unblock the Notifications