హైదరాబాద్ లో 5 హిడెస్ టూరిస్ట్ ప్లేసెస్ ఇవే.. ఒక్కసారి చూస్తే మళ్లీ మళ్లీ వెళ్తారు..!

హైదరాబాద్ లో అనేక చారిత్రక ప్రదేశాలు ఉన్నాయి. భాగ్య నగరంలో కొండలు, కోటలు, పురాతన కట్టడాలు ఉన్నాయి. హైదరాబాద్ అనగానే చాలామందికి చార్మినార్, గోల్కొండ, సాలార్ జంగ్ మ్యూజియం, ఇతర పర్యాటక ప్రాంతాలే గుర్తుకొస్తాయి. కానీ నగరంలో మనకు తెలియని అనేక టూరిస్టు ప్రాంతాలు ఉన్నాయని తెలుసా..? ఈ ప్రాంతాల్లో పర్యాటకులు చాలా తక్కువ మంది ఉంటారు. హిడెన్ ప్రాంతాలుగా ఇవి ఉన్నాయి. వీటిని ఒక్కసారి చూస్తే మళ్లీ మళ్లీ వెళ్లే అవకాశం ఉంది. వీటిల్లో సికింద్రాబాద్ లోని మహేంద్ర హిల్స్ లో ఉన్న ఆనంద బుద్ధ విహార్ ఆలయం ఒకటి. ఇది ప్రశాంతమైన బౌద్ధ దేవాలయం అలాగే ధ్యాన కేంద్రంగా ఉంది.

ఈ ప్రాంతం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు కేవలం 4 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. ఆనంద బుద్ధ విహార్ ఆలయంలో సుందరమైన స్థూపం, ధ్యాన మందిరం అలాగే బౌద్ధ గ్రంథాలతో కూడిన లైబ్రరీ ఉన్నాయి. ఇక్కడకు చేరుకుంటే ప్రశాంతమైన వాతావరణం, కొండపై నుంచి నగర వీక్షణ అద్భుతంగా ఉంటుంది. హైదరాబాద్ లోని మరో చారిత్రక కట్టడం ఖైరతాబాద్- పంజాగుట్ట పరిధిలోని ఎర్రమంజిల్ ప్యాలెస్. ఇది ఒక చారిత్రక రాజ భవనం. ఈ కట్టడాన్ని 1870 లో నవాబ్ సఫ్దర్ జంగ్ ముషీర్ ఉద్ ఔలా ఫక్రూల్ ముల్క్ నిర్మించారు. ఈ కట్టడం ఇండో యూరోపియన్ బరోక్ శైలి నిర్మాణానికి ప్రసిద్ధి చెందింది. అలాగే ఈ భవనం యూ ఆకారంలో ఉంటుంది.

ఇక సికింద్రాబాద్ లోని బన్సీలాల్ పేట మెట్ల బావి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ బావిని 17వ శతాబ్దంలో అసఫ్ జాహీ వంశస్తుల కాలంలో నిర్మించినట్లు చరిత్రకారులు భావిస్తున్నారు. ఈ బావిని 1954 కాలంలో నాగన్న కుంట అని పిలిచేవారు. సికింద్రాబాద్ తాగునీటి అవసరాల కోసం 1933 లో అప్పటి బ్రిటిష్ రెసిడెంట్ కీస్ దీనిని పునరుద్ధరించారు. అప్పటినుంచి ఈ బావి ప్రాంతానికి బన్సీలాల్ పేట్ అనే పేరు వచ్చింది.

Hyderabad tourist 5 hidden tourist spots visit them once and youll want to go back again and again

ఆ తర్వాత సంఘీ టెంపుల్ గురించి చూస్తే ఈ ఆలయం హైదరాబాద్ శివార్లలోని పరమానంద గిరి అనే కొండపై ఉన్న ప్రసిద్ధమైన దేవాలయం. ద్రావిడ నిర్మాణ శైలిలో అచ్చం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని పోలి ఈ ఆలయం ఉంటుంది. ఇక్కడ భారీ రాజగోపురం ఉంటుంది. ఈ ఆలయ పరిసరాలు చాలా అందంగా పచ్చదనంతో కూడుకుని ఉంటాయి. ముఖ్యంగా సాయంత్రం వేళల్లో విద్యుత్ దీపాల వెలుగులో ఈ ఆలయం చాలా మనోహరంగా ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+