విజయ్ దెబ్బకు డీఎంకే యూటర్న్..! పనిచేసిన రాహుల్ మంత్రాంగం..!
గత పార్లమెంట్ సమావేశాల్లో డీలిమిటేషన్ (నియోజకవర్గాల పునర్విభజన) బిల్లును ప్రవేశపెట్టి నెగ్గించుకునేందుకు కేంద్రంలో ఎన్డీయే విఫలయత్నం చేసింది. పార్లమెంట్ లో తమకు 2/3 వంతు మెజార్టీ లేదని తెలిసీ ఈ బిల్లును మహిళా బిల్లుతో ముడిపెట్టి నెగ్గించుకోవాలని చూసి విఫలమైంది. అయితే అప్పట్లో ఇండియా కూటమిలో కీలకంగా ఉన్న డీఎంకే(DMK).. ఆ తర్వాత తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత మారిన రాజకీయంలో ఈ బిల్లుకు ఈసారి అండగా నిలవాలని భావించింది. ఇందుకోసం కేంద్రానికి మూడు షరతులు కూడా పెట్టింది.
అయితే ఇదంతా గమనిస్తున్న విపక్ష రాహుల్ నేత రాహుల్ గాంధీ.. తమిళనాడులో తమ మిత్రపక్ష సీఎం విజయ్ కు దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. డీఎంకేను ఎలాగైనా డిలిమిటేషన్ బిల్లుకు మద్దతుగా ఉండేలా చేయాల్సిన అవసరాన్ని ఆయనకు గుర్తుచేశారు. అంతే .. విజయ్ తమిళనాడులో కాంగ్రెస్ ఎంపీలతో టచ్ లోకి వెళ్లారు. వారితో భేటీ ఏర్పాటు చేసి డీలిమిటేషన్ బిల్లుకు మద్దతిస్తే రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతమని చెప్పేందుకు సిద్దమయ్యారు. దీంతో డీఎంకే కు షాక్ తప్పలేదు.

డీలిమిటేషన్ బిల్లు విషయంలో కేంద్రానికి షరతులతో మద్దతివ్వాలని భావించిన డీఎంకే కాస్తా వెనక్కి తగ్గింది. ఈ బిల్లుకు మద్దతివ్వడం ద్వారా తనకు వచ్చే ప్రయోజనం లేకపోగా.. రాష్ట్రంలో రాజకీయంగా నష్టమని భావించినట్లు తెలుస్తోంది. అందుకే
రాష్ట్రంలో విపక్ష నేత ఉదయనిధి స్టాలిన్.. తమ పార్టీ మొదటి నుంచీ డీలిమిటేషన్‌ను వ్యతిరేకిస్తూనే ఉందని, ఇకపైనా అలాగే కొనసాగిస్తుందని ఇండియా టుడేతో స్పష్టంచేశారు. డీలిమిటేషన్ బిల్లుపై చర్చించేందుకు తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ రాష్ట్ర ఎంపీలతో సమావేశం ఏర్పాటు చేసిన నేపథ్యంలో డీఎంకే నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది.

లోక్‌సభలో 22 మంది, రాజ్యసభలో 8 మంది ఎంపీలతో పార్లమెంటులో డీఎంకే ఐదో అతిపెద్ద పార్టీగా ఉంది. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన వల్ల జనాభా పెరుగుదల ఎక్కువగా ఉన్న ఉత్తర భారత రాష్ట్రాలకు అన్యాయంగా ప్రయోజనం చేకూరుతుందనేది డీఎంకే వాదన. దక్షిణ భారత రాష్ట్రాలు జనాభా నియంత్రణలో మెరుగైన పనితీరును కనబరిచాయి. అయినా బీజేపీకి బలమైన పట్టు ఉన్న ఉత్తర భారత రాష్ట్రాలతో పోలిస్తే, తమకు లభించే సీట్ల సంఖ్య పెరుగుదల తక్కువగా ఉంటుందని ఆందోళన చెందుతున్నాయి. ఇప్పుడు దీనికి వ్యతిరేకంగా డీఎంకే నిర్ణయం తీసుకుంటే ఇబ్బందులు తప్పవని భావించడం వల్లే వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది.




Click it and Unblock the Notifications