ప్ర‌భుత్వం, ఏబీవీ ఢీ అంటే ఢీ: అన్నీ రికార్డు చేసి పెట్టుకుంటున్న ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావు

సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమ‌లు చేయ‌కుండా ప్ర‌భుత్వం వ్యూహాత్మ‌కంగా తాత్సారం చేస్తోంద‌ని భావిస్తున్న సీనియ‌ర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావు కూడా అంతే వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. తాను ఎన్నిసార్లు చీఫ్ సెక్ర‌ట‌రీని క‌లిసింది? ఎన్నిసార్లు క‌ల‌వ‌డానికి ప్ర‌య‌త్నించింది,?ఎన్నిసార్లు అపాయింట్‌మెంట్ ఇవ్వ‌డానికి నిరాక‌రించారు? క‌లిసిన‌ప్పుడు ఏం చెప్పారు? పోస్టింగ్ కోసం సుప్రీంకోర్టు తీర్పుపై ఏవిధంగా స్పందించారు? లాంటి విష‌యాల‌కు సంబంధించిన అన్ని విష‌యాల‌ను రికార్డు రూపంలో పెట్టుకున్న‌ట్లు తెలిసింది.

సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ప్ర‌భుత్వం అమ‌లు చేయ‌డంలేద‌ని స్ప‌ష్టం కావ‌డంతో కోర్టు ధిక్క‌ర‌ణ పిటిష‌న్ వేయ‌డానికి ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. వాస్త‌వానికి ఆయ‌న‌పై స‌స్పెన్ష‌న్ ఎత్తివేసిన‌ట్లుగా ఉత్త‌ర్వులైతే జారీచేశారుకానీ ఆయ‌న‌కు రావ‌ల్సిన వేత‌నం, పోస్టింగ్ ఇవ్వ‌డంలేదు. కోర్టు త‌న తీర్పులో త‌క్ష‌ణ‌మే పోస్టింగ్ ఇవ్వాల‌ని ఆదేశించిన సంగ‌తి తెలిసిందే.

AP Govt vs ABV: Former intelligence Chief AB Venkateshwarrao is up against Jagan govt-what is his next step

Recommended Video

    Ante Sundaraniki Movie Genuine Review *Reviews | Telugu Filmibeat

    ఏబీవీ కోర్టు ధిక్క‌ర‌ణ పిటిష‌న్ వేస్తే అందుకు త‌గ్గ వ్యూహాన్ని అమ‌లు చేయాల‌ని ప్ర‌భుత్వం కూడా యోచిస్తున్న‌ట్లు స‌మాచారం. కోర్టులో ఏబీవీ పిటిష‌న్ వేసిన త‌ర్వాత విచార‌ణ ముగింపు ద‌శ‌కు వ‌చ్చిన స‌మ‌యంలో ఏదో ఒక పోస్టింగ్ ఇచ్చామ‌నిపించే వ్యూహాన్ని అమ‌లు చేయ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. ఢీ అంటే ఢీ అంటూ హోరాహోరీగా త‌ల‌ప‌డుతున్న ఏబీవీ, ప్ర‌భుత్వ యుద్ధంలో ఎవ‌రు గెలుస్తారో వేచిచూద్దాం..!!

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+