రూ.10,000 కోట్ల పెట్టుబడితో భారీ పవర్ ప్రాజెక్ట్.. రాయలసీమ దశ మారిపోతుంది!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి పెట్టుబడులను ఆకర్షించే పనిలో ఉంది. ఇదే సమయంలో ఏపీలోని అన్ని ప్రాంతాల సామ్సమగ్రాభివృద్ధికి కూడా కృషి చేస్తుంది. అందులో భాగంగా ప్రభుత్వం అన్ని ప్రాంతాలలో పెట్టుబడులను ఆహ్వానిస్తోంది. తాజాగా ప్రభుత్వం అమలు చేస్తున్న గ్రీన్ ఎనర్జీ విధానాలకు సానుకూల స్పందనగా దేశ ప్రముఖ పునరుత్పాదక ఇంధన సంస్థ సుజ్లాన్ గ్రూప్ అనంతపురం జిల్లా రాయదుర్గం ప్రాంతంలో భారీ పెట్టుబడులు పెట్టనుంది.
రూ.10,000 కోట్ల వ్యయంతో విండ్, సోలార్ హైబ్రిడ్ విద్యుత్ ప్రాజెక్ట్స్
దాదాపు రూ.10,000 కోట్ల వ్యయంతో విండ్, సోలార్ హైబ్రిడ్ విద్యుత్ ప్రాజెక్టులను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు ప్రారంభించింది. రాయదుర్గం పరిసరాల్లో ఎత్తైన గుట్టలు, విశాల మైదానాలు ఉండటం వల్ల ఏడాది పొడవునా అధిక వేగంతో గాలులు వీస్తుంటాయి. ఈ భౌగోళిక అనుకూలతలను ఉపయోగించుకుని అత్యాధునిక విండ్ టర్బైన్లు, సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున స్వచ్ఛ విద్యుత్ ఉత్పత్తి చేయనున్నారు.

రాయలసీమ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు
సంస్థ ఇప్పటికే వాతావరణ డేటా సేకరణ, విండ్ మ్యాపింగ్, గ్రిడ్ కనెక్టివిటీ అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తోంది. ఈ ప్రాజెక్టు వల్ల రాయలసీమ ప్రాంతంలో వేలాది మంది స్థానిక యువతకు ప్రత్యక్షంగానూ, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయి. టర్బైన్లు, ప్యానెళ్ల నిర్మాణం, రవాణా, అసెంబ్లింగ్, ప్లాంట్ నిర్వహణ, ఇంజనీరింగ్ వంటి రంగాల్లో ఉద్యోగాలు పెరుగుతాయి. రహదారులు, రవాణా సదుపాయాలు మెరుగుపడటంతో పాటు చిన్న వ్యాపారాలు కూడా వృద్ధి చెందుతాయి.
ఉత్పత్తి అయ్యే విద్యుత్ రాష్ట్ర, జాతీయ గ్రిడ్‌కు అనుసంధానం
పర్యావరణ పరంగా కూడా ఈ ప్రాజెక్ట్ చాలా ముఖ్యమైనది. బొగ్గు ఆధారిత విద్యుత్‌పై ఆధారపడటం తగ్గించడంలో సహాయపడుతుంది. ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను రాష్ట్ర, జాతీయ గ్రిడ్‌కు అనుసంధానించడం ద్వారా పారిశ్రామిక, వ్యవసాయ, గృహ వినియోగదారులకు నిరంతర విద్యుత్ సరఫరా మెరుగుపడుతుంది. ప్రభుత్వం సింగిల్ విండో అనుమతులు, మౌలిక సదుపాయాల కల్పనతో పరిశ్రమలకు అనుకూల వాతావరణం కల్పిస్తోంది.
గ్రీన్ ఎనర్జీ హబ్‌గా అనంతపురం జిల్లా
ఈ క్రమంలో ఈ ప్రాజెక్ట్ కోసం భూసేకరణ, పర్యావరణ క్లియరెన్సులు, సబ్‌స్టేషన్ల అనుసంధానం వంటి ప్రక్రియలను వేగవంతం చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు విజయవంతమైతే అనంతపురం జిల్లా గ్రీన్ ఎనర్జీ హబ్‌గా ఎదగడమే కాకుండా మరిన్ని అంతర్జాతీయ సంస్థలు రాయలసీమలో పెట్టుబడులు పెట్టే అవకాశం పెరుగుతుంది. అనంతపురం దశ మారిపోతుంది.












Click it and Unblock the Notifications